ఈ మధ్యకాలంలో కంటి సమస్యలు చాలా మందిలో ఎక్కువైపోయాయి. సరైన జీవన విధానం లేకపోవడం, మొబైల్, టీవీ, లాప్టాప్స్ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించడం… ఇలా ఎక్కువగా స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. దీనితో కంటి చూపు కూడా బలహీనపడిపోతోంది. ప్రతి ఒక్కరు కూడా కళ్ళజోడు ధరించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పిల్లలు కూడా మొబైల్ ఫోన్ కి బాగా దగ్గరగా ఉంటున్నారు. బయట ఆడే ఆటల కంటే కూడా వీడియో గేమ్స్ ఎక్కువ ఆడడం చేస్తున్నారు. దీనితో పిల్లలకి కూడా చిన్నప్పుడే కంటి ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అయితే కంటి ఆరోగ్యం మెరుగు పడటానికి ఈ ఆహారపదార్థాలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
క్యారెట్ జ్యూస్ :
కంటి ఆరోగ్యానికి క్యారెట్ జ్యూస్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది ఇది కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కళ్ళజోడు ధరించక్కర్లేకుండా క్యారెట్ జ్యూస్ బాగా సహాయం చేస్తుంది. కావాలంటే క్యారెట్ జ్యూస్ తో పాటు టమాటా జ్యూస్ ని కూడా కలిపి తీసుకోవచ్చు.
పాలకూర జ్యూస్ :
పాలకూర కూడా కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూర జ్యూస్ కూడా పిల్లలకి ఇవ్వండి. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇది పిల్లల కంటి ఆరోగ్యానికి ఎంతో బాగా మేలు చేస్తుంది.
ఉసిరి జ్యూస్:
ఉసిరి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయుర్వేదంలో కూడా విరివిగా వాడుతూ ఉంటారు. ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కావాలంటే పచ్చి ఉసిరికాయను కానీ ఉసిరి క్యాండీ వంటి వాటిని కూడా ఇవ్వొచ్చు ఏ రూపంలో తీసుకున్నా ఉసిరి వల్ల ఎంతో మేలు కలుగుతుంది.