సహజంగా హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరగాలంటే.. ఇలా చేయండి..!

-

సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వాటిలో రక్తహీనత కూడా ఒకటి. చాలా శాతం మంది హెమోగ్లోబిన్ లేకపోవడం వలన ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సహజంగా హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరగాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను మీ డైట్ లో తప్పక చేర్చుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు వంటివి ఖచ్చితంగా తీసుకోవాలి. తరచుగా పాలకూరను తీసుకోవడం వలన ఐరన్, విటమిన్ సి ను పుష్కలంగా పొందవచ్చు. అంతేకాక దీనిలో ప్రోటీన్ శాతం కూడా ఎంతో ఎక్కువగా ఉంటుంది. కనుక శాఖాహారులకు ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు.

హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి గుడ్లు సహాయపడతాయి. వీటిలో ఉండే విటమిన్ బి 12 మరియు ఐరన్ రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. ఈ విధంగా హెమోగ్లోబిన్ లెవెల్స్ సహజంగా పెరుగుతాయి. తరచుగా ఆహారంలో భాగంగా శెనగలను తీసుకోవడం వలన ప్రోటీన్ మరియు ఫైబర్ తో పాటుగా ఐరన్ కూడా పుష్కలంగా శరీరానికి అందుతుంది. సోయా బీన్స్ తో తయారు చేసిన టోఫు లో ఐరన్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఉండే క్యాల్షియం మరియు మెగ్నీషియం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

క్వినోవాలో ప్రోటీన్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కోసం శాఖాహారులు దీనిని తప్పక తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. క్వినోవాలో ఉండే ఫోలేట్, విటమిన్ బి6, ఐరన్ మరియు ఇతర పోషకాలు ఆరోగ్యాన్ని పెంచుతాయి మరియు రక్తాన్ని పెంచడానికి సహాయపడతాయి. చాలా శాతం మంది డార్క్ చాక్లెట్ ను కేవలం స్నాక్ లాగా తింటూ ఉంటారు. కానీ దీనిలో ఉండే ఐరన్ హెమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచడానికి సహాయపడుతుంది. పైగా డార్క్ చాక్లెట్స్ లో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు మరియు మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. కనుక ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకుని హెమోగ్లోబిన్ లెవెల్స్ ను సహజంగా పెంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news