ఉల్లిపాయలపై నల్లటి మచ్చ ఉంటే వాడకూడదా..? అవి మంచివి కావా..?

-

ఉల్లిపాయలు వాడకుండా ఏ కూర అవ్వదు. పైగా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. మన జీర్ణవ్యవస్థను, గుండె ఆరోగ్యాన్ని కాపాడే శక్తి ఉల్లికి ఉంది. అందానికి, ఆరోగ్యానికి కూడా ఉల్లి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఉల్లి ఎంత మంచిది అయినా.. అది బాగున్నంత వరకే ఈ గుణాలను కలిగి ఉంటుంది. కొన్ని ఉల్లిపాయలను మీరు చూసే ఉంటారు. వాటిపైన నల్లగా ఉంటుంది. తోలుకే కదా.. అని మనం వాటిని తీసేసి క్లీన్‌ చేసి వాడేస్తుంటాం. కానీ ఇలా నల్లగా ఎందుకు ఉంటుంది. ఏమైనా ఫంగల్‌ ఇన్ఫెక్షనా..? ఇలాంటి వాటిని వాడొచ్చా..? నిపుణులు ఏం అంటున్నారు.

ఉల్లిపాయ తొక్కను తీయేటప్పుడు నల్లటి మచ్చ ఉంటే, అలాంటి ఉల్లిపాయలు తింటే మ్యూకోర్మైకోసిస్ వస్తుందా? అనే భయం చాలా మందికి ఉంటుంది. ఉల్లిపాయలపై సాధారణంగా కనిపించే ఈ నల్లటి మచ్చను ఆస్పర్‌గిల్లస్ నైగర్ అంటారు. ఈ రకమైన ఫంగస్ మట్టిలో కనిపిస్తుంది. ఉల్లిపాయల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ నల్ల అచ్చు మ్యూకోర్మైకోసిస్ కాదు. కానీ ఈ బ్లాక్ అచ్చు ఒక రకమైన టాక్సిన్‌ను విడుదల చేస్తుందని పరిశోధనలో తేలింది.

ప్రాణాపాయం కానప్పటికీ, ఇది అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇప్పటికే అలర్జీలు ఉన్నవారు ఈ బ్లాక్ అచ్చు ఉల్లిపాయకు దూరంగా ఉండటం మంచిదని అంటున్నారు. ఆస్తమా ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలని అంటారు.. కాబట్టి దాన్ని కొన్ని తర్వాత బ్లాక్ మచ్చ ఉన్న పొరను మాత్రమే తొలగించి మిగతాది ఉపయోగించవచ్చు. అయితే మీరు ఉపయోగించే ఉల్లిపాయ పొరపై ఆ నల్లటి అచ్చు పడకుండా జాగ్రత్త వహించండి. మీరు ఫ్రిజ్‌లో ఉల్లిపాయలను నిల్వ చేస్తుంటే, మీరు ఈ నల్లటి మచ్చలను తొలగించాలి. అలా వదిలేయడం వల్ల ఇతర ఆహార పదార్థాలతో కలిసిపోయి ఆహారం విషంగా మారుతుంది.

అలాగే ఉల్లిపాయలను కట్‌ చేసేప్పుడు పైన ఉండే గట్టి పదార్థాన్ని కూడా తొలగించాలి. అవి అలాగే కూరలో వేసి తినడం వల్ల పైల్స్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version