లెమన్ టీ తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. రెగ్యులర్ గా మీరు లెమన్ టీ కనుక తీసుకుంటే మీరు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. లెమన్ టీ కోసం మీరు ముందుగా నీటిని బాగా మరిగించి ఆ తర్వాత అందులో టీ పౌడర్ వేసి బాగా ఉడికించాలి. దానిలో కొద్దిగా నిమ్మరసం లేదా నిమ్మకాయ స్లైస్ వేసి మరిగించి ఆ తర్వాత సర్వ్ చేసుకుని తాగొచ్చు. ఇలా చేసుకుని తాగండి వల్ల జీర్ణక్రియ మెరుగు పరుస్తుంది.
చల్లని వాతావరణం లో కనుక ఒక కప్పు లెమన్ టీ తీసుకుంటే చాలా రిలాక్స్ గా ఉండొచ్చు. నాడీ వ్యవస్థ కూడా చురుకుగా పని చేస్తుంది. మెదడు కోసం అయ్యే సామర్థ్యం మరియు బలాన్ని కూడా మీకు అందిస్తుంది. దీనితో మీకు తలనొప్పి, స్ట్రెస్ వంటివి కూడా తగ్గుతాయి. చూశారు కదా దీని వల్ల కలిగే ప్రయోజనాలు మరి దీనిని తయారు చేసుకుని తాగండి. ఆరోగ్యంగా ఉండండి.