ఎక్కువసేపు నిద్రపోతే బరువు తగ్గుతారట.. తాజా పరిశోధనలో వెల్లడైన షాకింగ్ నిజాలు..!

-

ఈ రోజుల్లో టెన్షన్స్, ప్రజర్ లేని వాళ్లు అంటూ ఎవరూ ఉండటం లేదు. ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్లుకు ఉంటున్నాయి. కాలేజీ విద్యార్థులకు ఎగ్జామ్స్, ప్రాజెక్ట్సు గోల, ఆపీస్ కు వెళ్లేవాళ్లకు బాస్ పెట్టే ప్రజర్, వర్క్ టెన్షన్, అమ్మకు కొడుకు,కూతురు భవిష్యత్తుమీద బెంగ. నాన్నకు ఆర్థిక సమస్యలు ఇలా ఎవర్ని తీసుకున్నా, ఏ వయసు వారిని తీసుకున్నా ఏదో ఒక సమస్య వల్ల బాధపడుతునే ఉన్నారు..నీటన్నింటి ఫలితంగా..వెరసి అధికబరువు, టైంకు తినకపోవడం జరుగుతుంది.

వీటితోపాటు బోనస్ గా..ఒక స్టేజ్ కు వచ్చే సరికి..బీపీలు, షుగర్లు, గుండెసంబంధిత వ్యాధులు. మోకాళ్లనొప్పు కూడా వచ్చేస్తన్నాయి. ఈ రోగాలన్నింటికి కారణమైన ఊబకాయాన్ని తగ్గించడంలో నిద్ర సహాయపడుతుందని….తాజాగా యూనివర్శిటి ఆఫ్ చికాగోలో నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది..పడుకుంటే బరువుతగ్గటం ఏంట్రా అనేదా మీ డౌట్..చూద్దాం ఏం అంటున్నారో పరిశోధకులు

చికాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు రోజూ ఒక గంట ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు బరువు తగ్గుతారని తేల్చారు. వారి అభిప్రాయం ప్రకారం.. ప్రతి రోజు ఒక గంట ఎక్కువగా నిద్రపోవడం వల్ల అధిక బరువు ఉన్నవారు సంవత్సరంలో 3 కిలోల బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. రోజుకు 6.5 గంటల కంటే తక్కువ నిద్రపోయే 21 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల 80 మందిపై వారు ఈ పరిశోధన చేశారు.

weight-loss

అధ్యయనం చేసిన వ్యక్తులు మొదట స్మార్ట్ వాచ్‌లతో వారి నిద్ర విధానాలను తనిఖీ చేసి ఆపై మూత్రం నుంచి వారి క్యాలరీలను ట్రాక్ చేశారు. రోజుకు 1.2 గంటలు అంటే 1 గంట, 20 నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు 270 తక్కువ కేలరీలు ఖర్చుచేస్తారని పరిశోధనలో తేలింది. ఇలా చేయడం ద్వారా ఒక సంవత్సరంలో 4 కిలోల వరకు తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొన్నారు.. ఎక్కువసేపు నిద్ర పోవడం ఎక్కువ రోజులు కొనసాగించినట్లయితే బరువు తగ్గవచ్చు.

చాలా మంది వ్యక్తులు బరువు తగ్గడానికి కేలరీలను తీసుకోవడం తగ్గిస్తారు. అయితే ప్రతిరోజూ కేవలం కొన్ని గంటల ఎక్కువ నిద్రపోతే చాలు.. బరువు దానంతటే అదే తగ్గుతుందని ఈ పరిశోధన ద్వారా తెలుస్తుంది.

కాబట్టి ఎన్ని టెన్షన్స్, ప్రజర్స్ ఉన్నా బాగా నిద్రపోవడానికి ట్రై చేయండి..ఏ రోగాలు రావు..బరువు పెరగడం అనేది..శరీరంలో వచ్చే అనేక రోగాలకు గేట్ పాస్ లాంటిది. ఇది వచ్చిందంటే..ఇక ఆ రోగాలను ఆపేవారు ఉండరు..అన్నీ ఎంట్రీ ఇచ్చేస్తాయి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version