Alert : ఉప్పు, చక్కెరలో ప్లాస్టిక్..!

-

Micro plastics in salt and sugar

ఈరోజుల్లో ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి..? ఏ ఆహార పదార్థాలను తీసుకోకూడదు అనేది కూడా ఎవ్వరికీ తెలియట్లేదు. తాజాగా జరిగిన ఒక స్టడీ అందరినీ కుదిపేస్తోంది. ఉప్పు, చక్కెరలో ప్లాస్టిక్ ఉన్నట్లు స్టడీ వెల్లడించింది. మీరు షాక్ అయ్యారు కదా..? అసలు ప్లాస్టిక్ ఏంటి..? ఉప్పు పంచదారలో ప్లాస్టిక్ నిజంగా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాలి. దేశంలో విక్రయిస్తున్న ఉప్పు చక్కెరలో ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఏ బ్రాండ్ మినహాయింపు కాదని స్టడీ చెప్తోంది. కేవలం బ్రాండ్లే కాదు అన్ బ్రాండెడ్ ఉప్పు, చక్కెరలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు స్టడీ చెప్తోంది. వివిధ రకాలుగా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు స్టడీ ద్వారా తేలింది.

‘మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్’ అనే పేరుతో ఒక అధ్యయనాన్ని అధ్యయనం జరిపి, ఆ వివరాలని వెల్లడించింది. వీరు రకరకాల ఉప్పులను పరీక్షించారు, టేబుల్, సముద్ర ఇలా అన్ని రకాల ఉప్పులు ఇందులో ఉన్నాయి. ఫైబర్, ప్యాలెట్స్, ఫిలిమ్స్, ఫ్రాగ్మెంట్స్ రూపంలో మైక్రో ప్లాస్టిక్స్ చక్కెర, ఉప్పులో ఉన్నట్లు గుర్తించారు. ఈ మైక్రో ప్లాస్టిక్ సైజు 0.1mm నుంచి 5mm దాకా ఉంటుందని తెలుస్తోంది. అయోడైజ్డ్ సాల్ట్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది. మన ఇండియన్స్ సగటున రోజుకు 10.98 గ్రాముల సాల్ట్ తీసుకుంటారు అని గతంలో సర్వేలు ద్వారా తెలుస్తోంది. పది చెంచాల చక్కెరని రోజుకు ఇండియన్స్ తీసుకుంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే ఇది చాలా ఎక్కువ. మైక్రో ప్లాస్టిక్ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఉప్పు, చక్కెరలో ప్లాస్టిక్స్ ఉండడం వలన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒక కేజీ ఉప్పులో 6.91 నుంచి 89.15 వరకు మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు స్టడీ ద్వారా తెలిసింది. ఆర్గానిక్ సాల్ట్ లో తక్కువగా 6.7 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. కేజీ పంచదారలో 11 నుంచి 68 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version