అధికారంలోకి వచ్చిన రోజే సచివాలయంలో చెత్తను తొలగిస్తాం.. కేటీఆర్ సంచలన ట్వీట్..!

-

తెలంగాణ ప్రస్తుతం విగ్రహాల వివాదం నడుస్తోంది. నిన్న కేటీఆర్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సచివాలయంలో పెట్టకూడదని.. తెలంగాణ కి చెందిన అంజయ్యను అవమానించాడని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ దానికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజీవ్ గాంధీ గారి ముందుచూపు వల్లే భారతదేశం ఇప్పుడు ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పటిష్టంగా మారిందన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన స్థలంలో KTR వాళ్ళ అయ్య విగ్రహం పెట్టాలి అనుకున్నాడు. KCR సచ్చేది ఎప్పుడు.. ఆ విగ్రహం అయ్యేది ఎప్పుడు అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా దీనిపై స్పందిస్తూ.. కేటీఆర్ సంచలన ట్వీట్ వేశారు. “నా మాటలు గుర్తు పెట్టుకో సీఎం రేవంత్ రెడ్డి.. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్త చెత్త చెదారాన్ని.. తాము మళ్లీ కార్యాలయంలోకి వచ్చిన రోజునే తొలగిస్తాం.” అని రాసుకొచ్చారు. అలాగే నీలాంటి ఢిల్లీ గులాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, గర్వాన్ని అర్థం చేసుకోగలడని ఆశించలేం, బడి పిల్లల ముందు నీచమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ నిజమైన ఆలోచన చూపుతుంది. మీరు ఈ మానసిక వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని తన ట్వీట్ ద్వారా రాసుకొచ్చారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version