మైగ్రేన్ తలనొప్పి ఈ యోగాసనాలతో మాయం..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతున్నారు. ఆలోచించడం, అతిగా ఆలోచించడం, ఒత్తిడి కారణంగా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మైగ్రేన్ తలనొప్పి తో బాధపడే వాళ్ళు మందులు తీసుకోవడంతో పాటు వేళకు నిద్రపోవడం, సరిగ్గా రెస్ట్ తీసుకోవడం కూడా ముఖ్యం.

అయితే మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు ఈ యోగాసనాలు కనుక ప్రయత్నం చేసారు అంటే కచ్చితంగా మైగ్రేన్ తలనొప్పి నుండి బయటపడవచ్చు. అయితే మైగ్రేన్ తలనొప్పి నుండి బయటపడడానికి ఉపయోగపడే యోగాసనాలు గురించి ఇప్పుడు చూద్దాం.

భుజంగాసనం:

భుజంగాసనం వేయడం వల్ల మైగ్రేన్ తలనొప్పి దూరమవుతుంది. సూర్యనమస్కారాలు చేసినప్పుడు ఇది ప్రైమరీ పొజిషన్ అని చెప్పొచ్చు. తలనొప్పిని దూరం చేయడమే కాకుండా స్పైన్ హెల్త్ కి కూడా ఇది బాగా మేలు చేస్తుంది.

ఉష్ట్రాసన:

ఇది కూడా మైగ్రేన్ తలనొప్పిని దూరం చేస్తుంది. మీ కడుపు భాగమంతా కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. అలానే తలనొప్పిని కూడా దూరం చేస్తుంది. ముందు కోబ్రా పొజిషన్ మీకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఆసనం వేయండి. అప్పుడు సులభంగా ఉంటుంది.

సేతు బంధాసనం:

ఇది కూడా మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది. అలానే పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మైగ్రేన్ తో బాధపడే వాళ్లు ఈ ఆసనం కూడా ప్రయత్నం చేసి చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version