పాలు, తేనే కలిపి తీసుకుంటే వీటి నుండి బయటపడొచ్చు…!

-

ప్రతి రోజూ పాలు తాగడం చాలా ఆరోగ్యం అని మనకి తెలుసు. అయితే పాలు, తేనె కలుపుకుని తాగడం వల్ల పోషక విలువలు ఎక్కువగా మనకి చేరుతాయి. మామూలుగా పాలు, తేనే విడివిడిగానే చాలా మేలు చేస్తాయి. ఇలా ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. మామూలుగా తేనే తీసుకోవడం వల్ల జీర్ణకోశం లో నుంచి మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. పాల లో కొన్ని చుక్కల తేనె కలుపుకొని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటం తో కాక బ్లోటింగ్ , క్రామ్ప్స్ వంటి సమస్యలు తగ్గుతాయి.

రాత్రి పడుకునే ముందు కనుక పాలు తేనె కలిపి తీసుకుంటే మెదడు నుంచి శరీరానికి అంతా బాగుంటుంది అనే సిగ్నల్ ఒకటి వెళుతుంది. దీని మూలంగా హాయిగా నిద్ర పడుతుంది. కాబట్టి రాత్రులు సరిగ్గా నిద్ర పట్టట్లేదు అనుకునే వాళ్ళు దీనిని తీసుకుంటే మంచి నిద్రని పొందొచ్చు. పాల లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అయితే తేనె లో కలిపి పాలను తీసుకోవడం వల్ల ఈ కాల్షియంని బాగా అది లాగేసుకుంటుంది.

వయసు పై బడిన పెద్ద వారికి ఇది చాలా మంచిది. గోరు వెచ్చటి పాలు. తేనె తీసుకోవడం వల్ల గొంతు లో ఉండే బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీనితో శ్వాసకోశ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఏకాగ్రత పెరగడానికి కూడా ఇది మంచి చిట్కా. చల్లని పాలలో తేనె కలిపి తాగడం వల్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది. అలాగే శారీరకంగా, మానసికంగా కూడా అవసరమైన సామర్థ్యం ఏర్పడుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు పాలు తేనే తాగడం వల్ల సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version