ఉదయం బెడ్ టీ లేదా కాఫీ తాగేవారు వాటికి బదులుగా ఒక ఆపిల్‌ను తింటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే నిద్రమత్తు వదిలించుకుని యాక్టివ్‌గా ఉండేందుకు కాఫీ, టీలకు బదులుగా ఆపిల్ పండే బాగా పనిచేస్తుందని వారు చెబుతున్నారు.
సాధారణంగా మనలో అధికశాతం మంది ఉదయం నిద్ర లేవగానే బెడ్ మీద ఉండగానే బెడ్ కాఫీ లేదా టీ తాగుతుంటారు. బెడ్‌పై ఉండే టీ లేదా కాఫీ తాగి కానీ ఏ పనీ మొదలు పెట్టరు. కొందరు ఉదయం నిద్రమత్తును వదిలించుకుని యాక్టివ్‌గా ఉండేందుకు టీ, కాఫీలను తాగితే, మరికొందరికి అది అలవాటుగా ఉంటుంది. అయితే అసలు నిజానికి ఉదయం బెడ్ టీ, కాఫీకి బదులుగా బెడ్ ఆపిల్ తింటే ఎంతో మంచిదట. అవును, ఈ విషయాన్ని వైద్యులే స్వయంగా చెబుతున్నారు.
ఉదయం బెడ్ టీ లేదా కాఫీ తాగేవారు వాటికి బదులుగా ఒక ఆపిల్‌ను తింటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే నిద్రమత్తు వదిలించుకుని యాక్టివ్‌గా ఉండేందుకు కాఫీ, టీలకు బదులుగా ఆపిల్ పండే బాగా పనిచేస్తుందని వారు చెబుతున్నారు. ఆపిల్‌లో ఉండే సహజ సిద్ధమైన చక్కెర (ఫ్రక్టోజ్) కాఫీ, టీలలో ఉండే కెఫీన్ కన్నా బాగా పనిచేస్తుందని, దీంతో ఉదయం బెడ్ కాఫీ, టీలను తాగేందుకు బదులుగా ఒక ఆపిల్‌ను తింటే యాక్టివ్‌గా ఉండవచ్చని, దాంతో మన శరీరానికి ఉదయాన్నే శక్తి లభించి ఉత్సాహంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇక ఉదయాన్నే అలా ఆపిల్ పండును తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయని, ఇది ఎంతో ఆరోగ్యవంతమైన ప్రయోజనాలను కూడా ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. మరింకెందుకాలస్యం.. వెంటనే బెడ్ కాఫీ, బెడ్ టీలకు బదులు రోజూ ఒక ఆపిల్ తిని చూడండి.. ఫలితాలను బట్టి మీరే పై విషయాలను అంగీకరిస్తారు..!