ఈ లక్షణాలు కనబడితే లైట్ తీసుకోకండి.. ప్రాణానికి ప్రమాదం..!

-

మంచి ఆరోగ్యాన్ని పొందడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎన్నో ఆర్నారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కాకపోతే సరైన అవగాహన లేకపోవడం వలన వాటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధులు ఎదురైనప్పుడు వ్యాధి తీవ్రత ఎక్కువ అవ్వడం వలన మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక అటువంటి ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన సంకేతాలను ముందుగా గుర్తించి సరైన మార్పులను చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఉద్యోగం వలన సరైన సమయం దొరకకపోవడంతో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. వాటి వలన ఎన్నో వ్యాధులకు సంబంధించిన ప్రమాదం ఎక్కువ అయింది అనే చెప్పవచ్చు.

ఎప్పుడైతే ఈ సంకేతాలను మీరు గుర్తిస్తారో తప్పకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. సహజంగా జలుబు, దగ్గు వంటి సమస్యలను అందరూ ఎదుర్కొంటారు. కాకపోతే దగ్గినప్పుడు ఎప్పుడైతే నోట్లో నుంచి రక్తం వస్తుందో అది ప్రమాదం అని గుర్తుంచుకోవాలి. దానికి కారణం ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ తో పాటు లేక ఇతర వ్యాధులకు సంబంధించిన లక్షణం కావచ్చు. కనుక తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. ఎప్పుడైతే అకస్మాత్తుగా పొట్టలో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుందో కిడ్నీలో రాళ్ల సమస్య ఉందని అర్థం. కనుక ఇటువంటి లక్షణాలు కనపడినప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

ఎప్పుడైతే ఛాతిలో తీవ్రమైన నొప్పి వస్తుందో అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదు. ముఖ్యంగా ఎడమ చేతి వైపు చాతి నొప్పి వస్తుంది అంటే గుండెపోటుకు సంబంధించిన నొప్పి అని అర్థం. కనుక తప్పకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. మలం లేక మూత్రంలో రక్తం కనిపించినప్పుడు కిడ్నీ లేక పెద్ద పేగుకు సంబంధించిన సమస్యలు కావచ్చు. కనుక వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది ఎలాంటి వ్యాయామం చేయకుండా లేక జీవన విధానాన్ని మార్చుకోకుండా ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోతూ ఉంటారు. అయితే ఇలా జరిగినప్పుడు శరీరంలో ఏదో ఒక సమస్యకు సంకేతం అని గమనించాలి. కనుక ఇలా అకస్మాత్తుగా బరువు తగ్గినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news