మీకు మీరే ఇంట్లోనే బీపీ చేక్ చేసుకుంటున్నారా? ఈ పొరపాట్లు చేయకండి

-

హైబీపీ సమస్యతో బాధపడేవారు, గుండె సంబంధ సమస్యలతో సతమతమయ్యే వారు.. ఇంట్లోనే బీపీ చెక్ చేసుకుంటూ ఉంటారు. క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకుంటూ.. జాగ్రత్తగా ఉంటారు. బీపీ చెక్ చేయడం చాలా తేలికగా కనిపించినప్పటికీ.. సరైన రీడింగ్ రావాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ఇంట్లోనే బీపీ చెక్ చేసుకునేవారు చేసే పొరపాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఉదయం లేవగానే అస్సలు చెక్ చేయకూడదు:

ఉదయం నిద్ర లేవగానే బీపీ ఎలా ఉందో చెక్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ చెక్ చేసినట్లయితే బీపీ రీడింగ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. అప్పటిదాకా విశ్రాంతి తీసుకున్న శరీరం.. ఒక్కసారిగా పనిలో పడే మూడ్ లోకి వస్తుంది కాబట్టి బీపీ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

చేతిని సరైన స్థితిలో ఉంచాలి:

చేతిని సరైన స్థితిలో ఉంచకుండా.. పూర్తిగా కిందకు వంచినా, లేదా బాగా పైకి లేపినా బీపీ రీడింగ్ సరిగ్గా రాదని వైద్యులు సూచిస్తున్నారు.

అస్సలు మాట్లాకూడదు:

మాట్లాడుతూ కానీ, అటూ ఇటూ తిరుగుతూ కానీ బీపీ చెక్ చేయకూడదు. మాట్లాడుతున్నప్పుడు గానీ, తిరుగుతున్నప్పుడు బీపీ పెరిగే అవకాశం ఉందంట. దానివల్ల రీడింగ్ సరిగ్గా రాదు. కాబట్టి ప్రశాంతంగా కూర్చుని, మౌనంగా బీపీ చెక్ చేయాలి.

ఇంకా, కాఫీ తాగిన తర్వాత.. ఎక్సర్ సైజ్ చేసిన వెంటనే బీపీ అస్సలు చెక్ చేయకూడదు. అలాగే ఫుల్లుగా నీళ్ళు తాగి బీపీ చెక్ చేస్తే బీపీ రీడింగ్ సరిగ్గా రాదు.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version