Nipah Virus : హై ఎలర్ట్.. జనాలని వణికిస్తున్న నిఫా వైరస్..

-

Nipah Virus మళ్లీ జనాలని వణికిస్తోంది. కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాకు చెందిన 14 సంవత్సరాల బాలుడికి నిఫా వైరస్ సోకింది. తాజాగా డాక్టర్లు ఆ బాలుడికి వైద్య పరీక్షలు చేయగా అది పాజిటివ్‌గా తేలింది.ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి చాలా ఆందోళకరంగా ఉందని, ఒకవేళ పరిస్థితి కనుక ఇంకా విషమిస్తే కోజికోడ్ మెడికల్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.ఈ నిఫా వైరస్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షల నిమిత్తం బాలుడి నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించడం జరిగింది.

Nipah Virus

ఈ వైద్య పరీక్షల్లో ఆ బాలుడికి పాజిటివ్ వచ్చిందని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జీ ప్రకటించారు. ఆ తరువాత ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు.ప్రస్తుతం ఆ బాలుడు ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యమంత్రి తెలిపారు. అయితే బాలుడితో పరిచయం ఉన్న వారిని కూడా ట్రేస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైతే ఆ బాలుడికి దగ్గరగా సన్నిహితంగా ఉన్నారో ఆ వ్యక్తుల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపనున్నారు.

ఇక ఇప్పటికే హై రిస్క్ కాంటాక్టులను విభజించి నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. ఇంకా అలాగే మలప్పురంలోని ప్రభుత్వ విశ్రాంతి గృహంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అయితే ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నట్లు డాక్టర్లు వివరించారు. అయితే ఈ వైరస్ సోకితే మరణించే అవకాశాలు 40 నుంచి 75 శాతం దాకా ఉంటాయట.ఈ వైరస్ కి వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version