సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సంచలన ట్వీట్..!

-

మూసీ సుందరీకరణకే రూ. లక్షా యాభై వేల కోట్లా? పదిహేను పక్కన ఇన్ని సున్నాలా 15,000,000,000,000? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు మొన్న.. 50 వేల కోట్లు అయిందన్నరు. నిన్న 70 వేల కోట్లు వెచ్చిస్తామన్నరు. నేడు లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్నరు.. అని సీఎం మాట్లాడిన వీడియో షేర్ చేశారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లయితేనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ గగ్గోలు పెట్టిందన్నారు.

పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రి గారికి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా.. మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ ?? చివరిదశలో ఉన్న ప్రాజెక్టును పక్కనపెట్టి.. కోల్డ్ స్టోరేజీలోకి నెట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం..?? లండన్ లోని థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి ? గేమ్ ప్లాన్ ఏంటి ?? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version