Boiling Tea : టీ రుచిగా ఉండాలని ఎక్కువగా మరిగిస్తున్నారా..? ఈ 8 సమస్యలు తప్పవు..!

-

Boiling Tea : చాలామంది రుచిగా ఉండాలని టీ ని ఎక్కువ సేపు మరిగిస్తుంటారు. టీ పొడిలో పాలు, నీళ్లు పోసి పంచదార వేసి ఎక్కువసేపు మరిగిస్తూ ఉంటారు. మీరు కూడా ఇలాగే మరిగించుకుని టీ చేసుకుంటూ ఉంటారా..? అయితే ఎక్కువగా మరిగించుకోవడం వలన చాలా సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏంటి టీ ని బాగా మరిగించుకుంటే సమస్యలు కూడా వస్తాయా అని ఆశ్చర్యపోతున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాలి. టీ ని ఎక్కువగా మరిగించి తీసుకోవడం వలన అందులో ఉండే హానికరమైన పదార్థాలు విడుదలవుతాయి. అయితే ఈ హానికరమైన పదార్థాలు విడుదల ఇవ్వడం వలన ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇంఫ్లమేషన్ వంటి సమస్యలకు దారి తీస్తుంది, అంతేకాకుండా డయాబెటిస్
కార్డియో వాస్క్యూలర్ సమస్యలు, క్యాన్సర్ వంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

అలాగే పాలల్లో ప్రోటీన్స్ ఉంటాయి. హై టెంపరేచర్ కారణంగా పాలల్లో ఉండే ప్రోటీన్స్ అరగడానికి ఎక్కువ టైం పడుతుంది. దీంతో అజీర్తి సమస్యలు కలుగుతాయి. బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. బాగా ఎక్కువసేపు టీ ని మరిగించడం వలన రుచి చేదుగా మారిపోతుంది. అంతేకాకుండా ఐరన్ ని గ్రహించేస్తుంది. దీంతో ఐరన్ లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఎక్కువసేపు టీ ని మరగడం వలన కెఫిన్ బాగా విడుదలవుతుంది. అధిక మోతాదులో కెఫిన్ విడుదలవడం వలన యాంగ్జైటీ, నిద్రలేమి సమస్యలు, అజీర్తి సమస్యలు వంటివి కలుగుతాయి. ఎక్కువసేపు మరగడం వలన చేదుగా అనిపిస్తుంది. అందుకని చాలామంది ఎక్కువ షుగర్ ని యాడ్ చేస్తారు. ఇలా చేయడం వలన క్యాలరీలను ఎక్కువ తీసుకుంటుంటారు. పైగా బరువు పెరిగిపోవడానికి కూడా కారణం అవుతుంది. చూశారు కదా టీ ని ఎక్కువగా మరిగించుకోవడం వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయో.. సో ఈసారి తప్పులు జరగకుండా చూసుకోండి. అనవసరంగా ఇబ్బందులు బారిన పడకండి

Read more RELATED
Recommended to you

Exit mobile version