పారాసెట్మాల్ అతిగా వాడుతున్నారా? అయితే తిప్పలు తప్పవు!

-

చీటికి మాటికీ పారాసెట్మాల్ వాడుతున్నారా? అయితే చాలా కష్టం. పాపులర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శివ్ కుమార్ సారిన్ మాట్లాడుతూ, యునైటెడ్ స్టేట్స్ ఇంకా లండన్‌లో చాలా మంది కాలేయ వైఫల్యానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి పారాసెటమాల్ విషం అని చెప్పారు.ముఖ్యంగా కోవిడ్ తర్వాత, పారాసెటమాల్‌ను ఎక్కువగా నొప్పి నివారిణిగా ఉపయోగిస్తున్నారు.

డాక్టర్ శివ్ కుమార్ సరిన్ ఒక రోజులో కేవలం 2 పారాసెటమాల్ మాత్రలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎక్కువగా తీసుకుంటే కాలేయం సమస్య రావడం ఖాయం అంటున్నారు. ఎందుకంటే కాలేయం అనేది పక్కటెముక క్రింద, ఉదరం కుడి వైపున ఉండే ఒక చిన్న అవయవం. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడం నుండి, విషాన్ని వదిలించుకోవడం వరకు, ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను నిర్ధారించడం వరకు పనిచేస్తుంది.పారాసెట్మాల్ ఎక్కువగా వాడకం వల్ల మన లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే గ్లూటథియోన్ అనే సబ్ స్టాన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ పనితీరు, శరీరానికి కావాల్సిన ప్రొటీన్, కెమికల్స్ తయారు చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. అయితే ఇది మద్యం సేవించే వాళ్లు.. ఒబేసిటీ ఉన్న వారిలో తక్కువగా ఉంటుంది.

ఇంకా అలాగే ఎక్కువగా పారాసెట్మాల్ వాడే వారిలో లివర్ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయని డాక్టర్ సరిన్ స్పష్టం చేశారు. లివర్ డ్యామేజ్, లివర్ ఫెయిల్యూర్ జరిగే అవకాశం ఉంటుందట. మనం ఒక రోజులో రెండు, మూడు సార్లు పారాసెట్మాల్ వాడాలి అంటే అర ట్యాబ్లెట్ చొప్పున వాడుకోవాలని సూచిస్తున్నారు.ఒకవేళ కనుక మీరు పారాసెట్మాల్ ట్యాబ్లెట్ని ఎక్కువ మోతాదులో వాడాల్సిన పరిస్థితి వస్తే ఆ కేవలం వైద్యుని సలహా ప్రకారమే వాడాలని ఆయన సూచిస్తున్నారు. లేదంటే కచ్చితంగా అనారోగ్యాల పాలవ్వడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version