పిల్లలను హాస్టల్ కి పంపిస్తున్నట్లయితే.. ఈ విషయాలను తప్పకుండా నేర్పించాల్సిందే..!

-

పిల్లల చదువు గురించి తల్లిదండ్రులు ఎంతో ఎక్కువగా ఆలోచిస్తారు. ముఖ్యంగా, క్రమశిక్షణతో పాటుగా మంచి విద్యను అందించడానికి చాలా ప్రయత్నిస్తారు. దానికి సంబంధించి మంచి విద్యా సంస్థలను ఎంపిక చేసుకుని చదివిస్తారు. ఈ ప్రక్రియలో హాస్టల్‌ కు కూడా పంపాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో, తల్లిదండ్రులు మరింత భయపడుతూ ఉంటారు. మొదటిసారిగా పిల్లలను హాస్టల్‌ కి పంపిస్తున్నప్పుడు, పిల్లలు కూడా ఎక్కువ ఆసక్తి చూపరు. అయితే, వారిని హాస్టల్‌కి పంపే ముందు కొన్ని విషయాలను కచ్చితంగా చెప్పాలి.

మొదటిసారిగా హాస్టల్‌కు పంపుతున్నప్పుడు, పిల్లలను కొత్త విషయాలను నేర్చుకోమని, ఎటువంటి భయం లేకుండా వ్యవహరించాలి అనే విషయాన్ని కచ్చితంగా చెప్పాలి. ఈ విధంగా ప్రోత్సహించడం వలన, పిల్లలలో భయం తగ్గుతుంది. దీంతో, హాస్టల్ లో ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటారు. సహజంగా పిల్లలు ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడతారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పుడు, సొంత నిర్ణయాలను తీసుకోవడం ఎంతో అవసరం. కనుక, పిల్లలకు నిర్ణయాలను తీసుకోవడం గురించి చెప్పాలి. ఇలా తెలియజేయడం వలన, ఎంతో ధైర్యంగా ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకుంటారు.

హాస్టల్‌కి పంపే ముందు, పిల్లలకు బాధ్యతలను నేర్పించడం ఎంతో అవసరం. ముఖ్యంగా, ఇంట్లో చిన్న చిన్న పనులను చెప్పడం వలన వారికి అలవాటు అవుతుంది. దీంతో, హాస్టల్‌లో ఎంతో బాధ్యతగా వారి పనులు పూర్తి చేసుకోగలుగుతారు.కేవలం పిల్లలకు చదువు మాత్రమే కాకుండా మంచి వ్యక్తిత్వం కూడా ఎంతో అవసరం. కనుక ఇతరులను గౌరవించడం వంటివి నేర్పించాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారో, వారి చుట్టూ ఉండే తోటి విద్యార్థులు లేదా స్నేహితులు మీ పిల్లల వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతారు. కనుక ఇటువంటి మంచి విషయాలను తెలియజేయడం వలన ఎంతో మంచి మార్గంలో జీవిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news