సాధారణ తలనొప్పి కాదు..ఆరా లేని మైగ్రేన్‌ని ఎలా గుర్తించాలి?

-

చాలా మంది మైగ్రేన్ అంటే కేవలం తీవ్రమైన తలనొప్పి మాత్రమే అనుకుంటారు, కానీ కొందరికి తలనొప్పి రాకముందే కంటి ముందు మెరుపులు, దృష్టి సమస్యలు వస్తాయి. అయితే ఆరా లక్షణం లేకుండా వచ్చే మైగ్రేన్ చాలా ప్రమాదకరం. ఇది రోజువారీ సాధారణ తలనొప్పిలా అనిపించినా, జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మరి ఈ సైలెంట్ మైగ్రేన్ లక్షణాలను, దాన్ని సాధారణ తలనొప్పి నుంచి ఎలా వేరు చేయాలో తెలుసుకుందాం.

మైగ్రేన్‌లో సుమారు 70% మందికి ఆరా లక్షణం కనిపించదు. అందుకే దీన్ని గుర్తించడం కష్టమవుతుంది. అయితే దీనికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఒక సాధారణ తలనొప్పికి, ఆరా లేని మైగ్రేన్‌కి ఉన్న ప్రధాన తేడా తీవ్రత మరియు వ్యవధి.

తీవ్రమైన, పల్సింగ్ నొప్పి: తల యొక్క ఒక వైపున ఎక్కువ ఒత్తిడితో, డప్పు కొట్టుకున్నట్లు, నొప్పి రావడం. ఈ నొప్పి రెండు రోజుల నుండి మూడు రోజుల వరకు ఉండవచ్చు.

భౌతిక శ్రమకు తీవ్రతరం: మెట్లు ఎక్కడం, వ్యాయామం చేయడం లేదా తల కదిలించడం వంటి భౌతిక శ్రమ చేసినప్పుడు నొప్పి మరింతగా పెరగడం.

Persistent Migraines: Signs You Shouldn’t Ignore
Persistent Migraines: Signs You Shouldn’t Ignore

కాంతి, శబ్దాలకు సున్నితత్వం: మైగ్రేన్ ఉన్నప్పుడు కాంతి శబ్దాలను తట్టుకోలేకపోవడం. కొందరికి వాసనలకు కూడా అసహ్యం కలుగుతుంది. వాంతులు లేదా వికారం కూడా ఉండవచ్చు.

గుర్తించడం ఎలా? దీనికి చికిత్స ఏంటి: సాధారణ తలనొప్పి ఒకటి లేదా రెండు గంటల్లో తగ్గిపోతుంది. దానికి పైన చెప్పిన లక్షణాలు (పల్సింగ్ నొప్పి, కాంతి సున్నితత్వం) చాలా తక్కువగా ఉంటాయి. మీకు పైన చెప్పిన లక్షణాలలో కనీసం రెండు ఉండి, నొప్పి 4 గంటల కంటే ఎక్కువ ఉంటే, అది ఆరా లేని మైగ్రేన్ అయ్యే అవకాశం ఉంది.

నిర్ధారణ కోసం, డాక్టర్ మీ లక్షణాల చరిత్రను ఫ్రీక్వెన్సీని అడుగుతారు. చికిత్సలో భాగంగా,నివారణ మందులు మైగ్రేన్ వచ్చే ఫ్రీక్వెన్సీని, తీవ్రతను తగ్గించడానికి ప్రతిరోజూ తీసుకునే మందులు.

మైగ్రేన్ అనేది కేవలం తలనొప్పి కాదు, ఇది ఒక నాడీ సంబంధిత రుగ్మత. ఆరా లేని మైగ్రేన్‌ను సాధారణ తలనొప్పిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా, దాని లక్షణాలను సరిగ్గా గుర్తించడం ద్వారా సరైన సమయంలో చికిత్స తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి తగ్గించుకోవడం మరియు డాక్టర్ సలహాలను పాటించడం ద్వారా ఈ బాధను నియంత్రించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news