తల వెనుక నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా..?

-

చాలా మందికి తరచూ తలనొప్పి వస్తుంటుంది. కొందరికి తల ముందు భాగంలో నొప్పి వస్తే మరికొందరికి చుట్టూరా వస్తుంది. ఇంకొందరి తల వెనుక భాగంలో నొప్పి వస్తుంది. కొంత మందికైతే తలనొప్పి వచ్చినప్పుడు గుండసూది కిందపడినా ఆ శబ్ధాన్ని తట్టుకోలేరు. కాస్త సౌండ్ విన్నా వారి తల బ్లాస్ట్ అయిపోతుందేమోనన్నంత నొప్పి ఉంటుంది. దాదాపుగా మైగ్రేన్ తలనొప్పిలో ఇలా జరుగుతుంది. ఇంకొందరిలో తరచూ తల వెనకాల నొప్పి వస్తుంటుంది. తల అంతా భారంగా ఉండి ఏ పని చేయాలనిపించదు. ఈ నొప్పిని అసలు నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు డాక్టర్లు.

చాలా మందిలో తలంతా కాకుండా తల వెనుక భాగంలో మాత్రమే నొప్పి వస్తుంది. సాధారణంగా తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు ఈ నొప్పి వస్తుంది. ఒత్తిడి తీవ్రత పెరిగినా కొద్దీ తలనొప్పి పెరుగుతూ వస్తుంది. ఈ నొప్పి వల్ల కేవలం తల మాత్రమే కాదు.. ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు వైద్య నిపుణులు.

వెన్నెముకలో అన్నింటికన్నా పైన ఉండే వెన్నుపూస అట్లాస్ సీ1. ఇది పుర్రెను, రెండో వెన్నుపూసను కలుపుతుంది. తలను మోస్తూ.. తల కదలడానికి ఇది తోడ్పడుతుంది. ఏవైనా దెబ్బలు తగిలినా.. రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్ వంటి వ్యాధి సోకినా ఈ వెన్నుపూస అది ఉన్నచోటు నుంచి జరుగుతుంది. అప్పుడు అక్కడ ఉండే నాడి నొక్కుకుపోతుంది. దీనికి అనుసంధానంగా ఉన్న కీలు కూడా దెబ్బతినవచ్చు. తల వెనకాల, మెడ పైభాగంలో నొప్పి రావడానికి ఇదొక కారణమని వైద్యులు చెబుతున్నారు.

కొందరికి తలకు ఒకవైపున కూడా నొప్పి వస్తుంది. సూదులతో పొడుస్తునట్లు నరకంగా అనిపిస్తుంది. ఈ నొప్పి దేనివల్ల వస్తుందో కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. స్పెల్ సీక్వెన్స్ ఎక్స్ రే, ఎంఆర్ ఐ, సీటీ సర్వైకల్ స్పైన్ పరీక్షలు చేయిస్తే ఈ నొప్పి దేనివల్ల వస్తుందో తెలిసే అవకాశముంటుందని అంటున్నారు. తలను పైకెత్తినప్పుడు, కిందికి దించినప్పుడు పూస ఎలా ఉంటోంది, ఎటువైపునకు జరుగుతుందనేది వీటిల్లో తెలుస్తుంది. ఒకవేళ అట్లాస్‌ పూస నిజంగానే స్థానభ్రంశం చెందినట్టు తేలితే సర్జరీతో సరి చేయాల్సి ఉంటుంది. మీరు న్యూరాలజిస్ట్‌ను గానీ న్యూరోసర్జన్‌ను గానీ సంప్రదించండి. అవసరమైన పరీక్షలు చేసి, తగు చికిత్స సూచిస్తారని వైద్యులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version