వేయించిన శనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేయించిన శనగలని రెగ్యులర్ గా తీసుకోవడం వలన చాలా సమస్యలు తొలగిపోతాయి. వీటి వలన కలిగే లాభాలను చూశారంటే ఆశ్చర్యపోతారు. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ ఇతర పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ఇక వీటి వలన కలిగే లాభాల గురించి చూద్దాం. అలాగే తొక్కతో తినొచ్చా లేదా అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఆరోగ్య నిపుణులు చెప్పిన సమాధానాన్ని చూద్దాం. తొక్కతో తీసుకుంటే ఫైబర్ ఎక్కువగా అందుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. అజీర్తి సమస్యలు కూడా తొలగిపోతాయట.
మలబద్ధకం వంటి సమస్యలను కూడా ఇది నయం చేస్తుంది. అలాగే కడుపు నిండిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. బరువు తగ్గడానికి కూడా ఇవి బాగా ఉపయోగ పడతాయి. వేయించిన శనగలు తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయట. ఫ్రీ రాడికల్స్ ని నయం చేయడానికి సహాయపడుతుంది. అలాగే తొక్క తీయకుండా శనగల్ని తీసుకుంటే అజీర్తి సమస్య నుండి త్వరగా బయటపడొచ్చు.
అయితే జీర్ణవ్యవస్థ సరిగ్గా లేని వాళ్ళు తొక్కతో తీసుకోవడం వలన గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. తొక్క తీయకపోయినా కూడా తీసుకోవచ్చు అందులో సమస్య ఏం లేదు. అయితే వేయించిన శనగలు లేదా బఠాణీ వంటి వాటిని తొక్కతో తీసుకోవడం వలన ఫైబర్ బాగా అందుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా అందులో సమృద్ధిగా ఉంటాయి. అజీర్తి సమస్యలు నయం చేయడానికి, బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. అజీర్తి సమస్యలతో బాధపడే వాళ్ళు మాత్రం తొక్క తీసుకొని తినవచ్చు. చూశారు కదా ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది. మరి ఈసారి డైట్ లో వీటిని కూడా చేర్చుకోండి అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గడానికి, అజీర్తి సమస్యలను నయం చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి