ఈ మధ్యకాలంలో ప్రతి ఉద్యోగంలో పని గంటలు ఎక్కువ అవుతున్నాయి. ఇంట్లో లేక ఆఫీసులో గంటల కొద్దీ కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని పని చేయడం ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణం అయిపోయింది. అయితే ఇలా ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటలు తరబడి ఒకే ప్రదేశంలో కూర్చుని పని చేయడం వలన తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి ఉద్యోగంలో అయినా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం మరియు వృత్తి గత జీవితం మధ్య సమతుల్యత ఉండాలి. ఎక్కువసేపు పనిచేయడం వలన వ్యక్తిగత జీవితాన్ని కోల్పోకూడదు. ముఖ్యంగా ప్రతి ఉద్యోగంలో పని గంటలు పెరగడం వలన రోజురోజుకు శరీరం మరియు మనసు కూడా ఎంతో బలహీనంగా మారుతున్నాయి.
కదలకుండా ఒకే ప్రదేశంలో ఎక్కువ సమయం కూర్చోడం వలన భవిష్యత్తులో ఎంతో ఇబ్బందిపడాల్సి ఉంటుంది మరియు శరీరం ఎంతో తీవ్రమైన అలసటకు గురవుతుంది. దీంతో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఎలాంటి ఉద్యోగంలో అయినా ఎక్కువసేపు కదలకుండా కూర్చొని పనిచేస్తే మానసికంగా కూడా ఎంతో అలసిపోతారు మరియు ఎలాంటి విషయం పైన శ్రద్ధ పెట్టలేరు. దీంతో నిర్ణయాలను కూడా తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది అవుతుంది. దీర్ఘకాలంగా ఇదే కొనసాగితే మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి మొదలైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఎక్కువసేపు పనిచేయడం వలన రోగనిరోధక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. దీంతో ఎన్నో రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరిగిపోతుంది. రోజంతా పని చేయడం వలన అలసటతో నిద్రకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువ సేపు పని చేయడం వలన సరైన నిద్ర ఉండదు మరియు గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు, పక్షవాతం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. అంతేకాకుండా గంటలు సేపు ఒకే ప్రదేశంలో కూర్చోడం వలన కీళ్ల సమస్యలు, వెన్ను నొప్పి, మెడ నొప్పి వంటివి ఎక్కువ అవుతాయి.