సౌండ్‌బాత్‌తో ఒత్తిడి మాయం..ఉత్తేజం కాయం..!!

-

మ్యూజిక్‌ ఎలాంటి మూడ్‌ను అయినా సెట్‌ చేస్తుంది.. మనకు హ్యాపీగా ఉన్నప్పుడు మంచి జోష్‌ ఉన్న సాంగ్స్‌ వింటే.. ఆనందం రెట్టింపు అవుతుంది. అలాగే ఏదైనా శాడ్‌లో ఉంటే.. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌ ప్రాబ్లమ్లో ఉన్నప్పుడు లవ్‌ సాంగ్స్‌ వింటే.. ఆ లిరిక్స్‌ అన్నీ మనకోసమే రాసారా అన్నట్లు ఉంటాయి..ప్రతీది హార్ట్‌ టచ్చింగ్‌ ఉంటుంది.. అయితే మీరు ఎప్పుడైనా సౌండ్‌బాత్‌ గురించి విన్నారా..? స్ట్రీమ్‌ బాత్‌, శాండ్‌ బాత్‌, మడ్‌ బాత్‌ గురించి తెలుసు.. ఇదేంటిది.. సౌండ్‌బాత్‌ వెరైటీగా ఉంది అనుకుంటున్నారా..?.. సంగీత మాధ్యమంలోనే కాకుండా… కొన్ని నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలలో వెలువడే శబ్దాలతో ఒత్తిడి తగ్గించే ప్రక్రియనే సౌండ్‌బాత్ అంటారు.

ధ్యానం లాంటి లేదా యోగాలాంటి ఫలితాలనిచ్చే ప్రక్రియ. కొన్ని రకాల శబ్దాలు ఓ క్రమపద్ధతిలో ఒకే లాంటి ఫ్రీక్వెన్సీ స్థాయుల్లో మంద్రంగా వెలువడుతూ… మన దేహాన్ని కండరాల ఒత్తిడి ఉన్నప్పుడు వాటిని రిలాక్స్‌ చేసేలా, మానసిక ఒత్తిడి నుంచి విముక్తం చేసేందుకు ఉపకరించే ఈ ప్రక్రియ ఒక యోగాలాంటిదని క్లివ్‌లాండ్‌ క్లినిక్‌లోని మేరిమైంట్‌ మెడికల్‌ సెంటర్.. బ్రాడ్‌వ్యూ హైట్‌కు చెందిన ఇంటర్నల్‌ మెడిసిన్‌ వైద్య సహాయకురాలు కరేన్‌బాండ్‌ అంటున్నారు..

ఒత్తిడి మాయం
భారతీయ యోగా ప్రక్రియలో ఉచ్చరించే ‘ఓమ్‌’ శబ్దాలు, చైనా సంప్రదాయ వైద్యం (ట్రెడిషనల్‌ చైనీస్‌ మెడిసిన్‌–టీఎమ్‌సీ)లో ఉచ్చరించే ‘చి’ లాంటి శబ్దాలను (చైనీస్‌ అక్షరమైన దీని స్పెల్లింగ్‌ ఇంగ్లిష్‌లో ‘క్యూఐ’ కాగా దీన్ని (సీహెచ్‌ఐ గా ఉచ్చరిస్తారు) ఉదాహరణలుగా చూపుతున్నారు. అవి శరీరంలోని శక్తిప్రవాహాన్ని ఏర్పరచడం, క్రమబద్ధ పద్ధతిలో ప్రవహింపజేయడం ద్వారా ఒత్తిడిని తొలగించేందుకు సహాయపడతాయని ఆమె తెలిపారు..

ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి తన జీర్ణవ్యవస్థ క్రమబద్ధంగా లేకపోవడాన్ని కంప్లెయింట్‌గా చెబితే… వారిలో ఆ ప్రాంతాన్ని నయం చేసేలా ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో శబ్దాలు వినిపించడం జరుగుతుందట..శబ్దాలతో కలిగే వైద్య ప్రయోజనాలపై 2014 నుంచి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయనీ, ఈ తరహా శబ్దచికిత్సలు చవకైనవి మాత్రమే గాక… సురక్షితమైనవని ఆమె అంటున్నారు..

చిన్న చిన్న సమస్యల్లోనే కాకుండా దీర్ఘకాలిక వెన్నునొప్పులు, క్యాన్సర్‌తో బాధపడేవారిలో కలిగే నొప్పుల ఉపశమనానికి కూడా ఈ శబ్ద చికిత్సలు ఉపయోగపడుతున్నాయట.. ఈ తరహా పరిశీలనలు జరుగుతున్నప్పుడు నిదర్శనాలు, ఫలితాల ఆధారంగా వాస్తవాలు తెలుసుకునే పరిశోధన జరుగుతున్నట్లు కరేన్‌బాండ్‌ వెల్లడించారు.

సౌండ్‌ బాత్‌ తర్వాత తమ క్లైంట్లను ప్రశ్నించినప్పుడు… కొందరు ఒత్తిడి తగ్గిందనీ, మరికొందరు తమ కండరాలు వదులుగా, రిలాక్స్‌డ్‌గా మారాయనీ, నొప్పి తగ్గిందనీ, నిద్ర బాగా పట్టిందని, మూడ్స్‌ మెరుగుపడ్డాయని, తమ శరీరంలో చోటు చేసుకుంటున్న మార్పులు తమకు బాగా తెలిసినట్లుగా అనుభూతి కలిగిందనీ వివరించినట్లు కరేన్‌ బాండ్‌ తెలిపారు.

సౌండ్‌ బాత్‌ కోసం ఏయే పరికరాలు ఉపయోగిస్తారంటే…?

జలతరంగిణిలో ఉపయోగించేలాంటి గిన్నెలు
టిబెటన్‌ పాటల్లో ఉపయోగించేలాంటి గిన్నెలు
ట్యూనింగ్‌ ఫోర్క్‌లు
జేగంటలు (గాంగ్‌)
ఫెంగ్‌ షుయీ పద్ధతుల్లో ఇంట్లో వేలాడదీసినప్పుడు ఆహ్లాదకరంగా మోగుతుండే స్తూపాకారపు అలంకరణ వస్తువులు (చిమ్స్‌)
కొన్ని చిరుమువ్వలు
ఆహ్లాదకరమైన శబ్దాలను వెలువరించే చిరు గంటలను సౌండ్‌ బాతింగ్‌ కోసం ఉపయోగిస్తారు.

సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా..
దీని ఫలితాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. సౌండ్‌బాత్‌ తర్వాత కొందరు కాస్త అలసటగా ఫీలవుతారు. దీనికి భిన్నంగా మరికొందరు బాగా శక్తిపుంజుకున్నట్లు అనుభూతి చెందుతారు. ఒక్కొక్కరికి ఓక్కో ఫీలింగ్‌ ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version