Heart Attack : గుండెపోటు రావడానికి ముందు వచ్చే సంకేతాలు ఇవే.. జాగ్రత్త పడండి..!

-

Heart Attack  : ప్రస్తుత కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారు పెరిగిపోతున్నారు. అందులోనూ ఆశ్చర్యంగా యువత సడన్ గా కుప్పకూలి ప్రాణాలు వదిలిన ఘటనలు చాలానే వింటున్నాం. గుండె పోటు వచ్చే ముందు కచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటి గురించి తెలుసుకొని సకాలంలో జాగ్రత్త పడితే ప్రాణాల నుంచి తప్పించుకోగలం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Heart Attack

గుండె పోటు వచ్చే ముందు వికారంగా లేదా మైకంగా అనిపిస్తుందట. అజీర్తి లేదా సాధారణ జలుబు కారణంగా కూడా ఇలాంటి అసౌకర్యం ఉంటుందట. అప్పుడు ఛాతీ నొప్పి లేదా ఊపిరి ఆడకపోవడం వంటి ఇతర సంకేతాలు వస్తాయి. అప్పుడు వెంటనే డాక్టర్ ని కలవాలి. లేదంటే కచ్చితంగా గుండెపోటు రావచ్చు.పెద్దగా కష్టపడకపోయినా బాగా చెమట పడితే కచ్చితంగా ఆ సంకేతం గుండె పోటుకి దారి తీస్తుందట. పైగా ఇది ఏదైనా శారీరక పని చేసినప్పుడు లేదా వేడి నుండి వచ్చే సాధారణ చెమటలా కాకుండా చల్లగా, తేమగా ఉంటుందట. ఇది గుండెపోటు లక్షణమట. కాబట్టి ఇలా చెమటలు పడుతుంటే వెంటనే దగ్గర్లో ఉన్న డాక్టర్ ని కలవాలి.

అలాగే ఎక్కువగా కష్టపడి పని చేయకపోయినా అసాధారణంగా అలసిపోయినట్లు ఉన్నా బలహీనంగా అనిపించినా కచ్చితంగా శరీరంలో ఏదో తేడాగా జరుగుతుందని సంకేతం. కొంచెం పని చేసినా అలసటగా అనిపిస్తుంది. ఇది గుండె బలహీనతకు సంకేతం. ఈ లక్షణం కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ని కలవాలి.శరీరంలో ఎడమవైపు అంటే గుండె వైపు ఉన్న బాగాలు ఎడమ చెయ్యి, వీపు, మెడ, దవడ లేదా కడుపు దాకా నొప్పి, తిమ్మిరి లేదా ఒత్తిడిగా ఉంటే కచ్చితంగా జాగ్రత్త పడాలి. అది గుండె పోటు యొక్క లక్షణం.

ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు నొప్పి లేదా అసౌకర్యంగా ఉందంటే అది కచ్చితంగా గుండె పోటుకి దారి తీసే లక్షణం. అప్పుడు ఛాతీలో ఒత్తిడిగా, పిండేసినట్లు అనిపిస్తుంది. ఇక అప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ని కలవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version