‘బంతిపూల టీ’ తో పిరియడ్స్ లో అధిక బ్లీడింగ్ సమస్యకు పరిష్కారం. సైంటిపిక్ గా తేల్చారు..!

-

ఆడపిల్లలకు పిరియడ్స్ పెయిన్స్ అంటే నరకమే.. కొందరు వాటిని భరించలేక విపరీతంగా ఏడుస్తారు. మందులు, ఇంజక్షన్స్ చేయించుకుంటారు. ఆ నాలుగురోజులు దినదిన గండం నూరేళ్ల ఆయుష్యు అన్నట్లే. కొందరు నొప్పితో బాధపడితే..మరికొందరు ఘోరంగా బ్లీడింగ్ అయి ఇబ్బందిపడతారు. ఇంకా పొత్తికడపునొప్పి… సమస్యను పరిష్కరించుకోవడం ముఖ్యమే.. కానీ ఏ విధంగా అనేదే మరీ ముఖ్యం. ఒక టాబ్లెట్ వేసినా నొప్పి నయం అవుతుంది. కానీ దానివల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. దీర్ఘకాలంలో వాడితే.. లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈరోజు మనం ఈ పిరియడ్స్ టైంలో అధికంగా బ్లీడింగ్ అవటం, నొప్పి రావటం ఎళా తగ్గించుకోవచ్చో చూద్దాం.

మారీగోల్డ్ టీ పిరియడ్ పెయిన్స్ కు అద్బుతంగా పనికొస్తుంది. మారీగోల్డ్ టీ అంటే.. టీలో మారీగోల్డ్ బిస్కెట్స్ వేసుకుని తాగడం అనుకునేరు.. బింతిపూల టీ అండీ..! సంవత్సరం పొడువునా బంతిపువ్వులు అందుబాటులో ఉంటాయి కదా. ఇంకా చవకగా వస్తాయి కూడా. ఫంక్షన్స్ లో ఈ పువ్వులదే హవా..! ఆ పువ్వుల రేకులతో డికాషిన్ చేసుకుని తాగితే..ఆ నాలుగు రోజులు హాయిగా ఎలాంటి నొప్పులు లేకుండా గడిచిపోతాయి.

బంతిపువ్వుల టీ ఎలా చేసుకోవాలి..?

బంతిపువ్వుల రెక్కలు నాలుగు స్పూన్లు తీసుకుని నీళ్లలో వేసి మరగించండి. బాగా మరిగే సరికి నీళ్లు రంగుమారి..బంతిపువ్వు రేకుల్లో ఉండే మెడిసినల్ ప్రోపర్టీస్ అన్నీ వాటర్ లో కి వచ్చేస్తాయి. ఫిల్టర్ చేసి తేనె కలుపుకుని 50ml అంటే ఒక కాఫీ కప్పు అంత తాగండి. పీరియడ్స్ టైంలోనూ.. పిరియడ్స్ రావడానికి రెండుమూడు రోజుల ముందు నుంచి ఇది తాగొచ్చు.

పిరియడ్స్ టైంలో ఇది తాగటం వల్ల నూట్రస్ మజిల్స్ రిలీక్స్ అవుతాయి. ఈ టీలో క్వర్సటిన్( Quercetin), ఫ్లేవనాయిడ్స్( Flavonoids), శాపోనిన్స్ (saponins), టర్పినాయిడ్స్ అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నొప్పికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్( Prostaglandin)ను కంట్రోల్ చేసి నొప్పిని తెలియచేయకుండా చేస్తుంది. బ్లీడింగ్ ను రెగ్యులేట్ చేయడానికి బాగా పనికొస్తుంది.

వీటితోపాటు.. స్త్రీల్లో యూరినరి ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దురదలు రావటం, ఎరుపెక్కడం, దుర్వాసన రావడం జరుగుతుంది. అప్పుడు కూడా ఈ మారీగోల్డ్ టీ తాగితే తగ్గుతున్నాయని సైంటిఫిక్ గా నిరూపించారు. ఈ పరిశోధన అంతా 2012వ సంవత్సరంలో యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ మెడిసిన్( University Of Agriculture And Veterinary Medicine- Romania) వారు పరిశోధన చేసి ఇచ్చారు.

ఇతర రోజుల్లో వాడుకోవక్కర్లేదు. కేవలం ఆ నాలుగు రోజులు తాగితే చాలు. మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటే ఫ్రెష్ గా వాడుకోవచ్చు. లేదంటే.. దొరికినప్పుడే తీసుకొచ్చి వాటిని రేకులు తీసి ఎండపెట్టి పెట్టుకుని కావాల్సినప్పుడు డికాషన్ చేసుకుని తాగేయొచ్చు. ఈ టీ తాగడంతో పాటు.. నొప్పి ఉన్న భాగంలో ఆవనూనె, ముద్దకర్పూరం వేసి గోరువెచ్చగా చేసి మసాజ్ చేసుకుని.. వేడినీళ్లతో మసాజ్ చేసుకుంటే.. త్వరగా రిలీఫ్ వస్తుంది. అయితే బ్లీడింగ్ ఎక్కువగా అయ్యేవారు.. వేడిపెట్టకూడదు. ఐస్ ప్యాక్ వేసుకోవాలి. పదినిమిషాలు అలా ఐస్ ప్యాక్ వేసుకుంటే.. బ్లీడింగ్ ఇరెగ్యులారిటీ తగ్గుతుంది.

సైంటిఫిక్ గా నిరూపించారు కాబట్టి.. పిరియడ్స్ అంటేనే భయపడే మహిళలు ఈసారి ఈ టీ తాగి చూడండి. మీకు మంచి రిజల్ట్ వచ్చిందంటే.. ఇక హ్యాపీగా వాడుకోవచ్చు కదా..! ఎప్పుడో ఒకసారి కానీ..పిరియడ్ పెయిన్స్ కు టాబ్లెట్ వేసుకోవడం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదనేది మాత్రం వాస్తవం.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version