గర్భిణీలు తమ యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచి జీవన విధానాన్ని అనుసరించడం ఎంతో అవసరం. అయితే గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.
అయితే రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అసలే ఇప్పుడు చలికాలం కనుక గర్భిణీలు జలుబు, జ్వరం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వంటి వాటికి దూరంగా ఉండడానికి శ్రద్ధ తీసుకోవాలి. అలానే అటువంటి సమస్యల బారిన పడకుండా ఇమ్యూనిటీని పెంచుకుంటూ ఉండాలి. ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే మరి అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
వెల్లుల్లి:
వెల్లుల్లి గర్భిణీలకు చాలా మేలు చేస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలు తరిమికొడుతుంది. వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒంటిని వేడిగా ఉంచుతుంది అలానే ఇమ్యూనిటీని పెంచుతుంది.
అల్లం :
అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. మార్నింగ్ సిక్ నెస్, వికారం వంటి సమస్యలకు ఇది తరిమికొడుతుంది. అల్లం ని మీ డైట్ లో చేర్చడం వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అలానే అజీర్తి సమస్యలు కూడా ఉండవు.
పసుపు:
పసుపులో యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. పాలల్లో కొద్దిగా పసుపు వేసుకుని తీసుకుంటే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. అలాగే జలుబు, దగ్గు సమస్యలు నుండి కూడా బయటపడొచ్చు.
ఉసిరి:
ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. కడుపులో ఉండే బిడ్డ కి కూడా మంచి సామర్థ్యాన్ని ఇస్తుంది. ఉసిరి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.