అస్తమానం రైస్ తినడం వల్ల బరువు పెరుగుతున్నామన్న ఉద్దేశ్యమో, లేకపోతే శరీరానికి కార్బోహైడ్రేట్లతో పాటు అన్ని పోషకాలు సరిగ్గా అందాలన్న ఉద్దేశ్యంతోనో.. ఆహారంలో పండ్లను భాగం చేసుకుంటారు చాలామంది. పోషకాలు అందాలన్న కాన్సెప్ట్ మంచిదే కానీ పండ్లను తీసుకోవడం వల్ల శరీర బరువు పెరుగుతుందని మీకు తెలుసా..?
యెస్.. కొన్ని పండ్లు శరీర బరువును అమాంతం పెంచేస్తాయి. ఆ పండ్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
అరటి పండు:
వంద గ్రాముల అరటి పండులో 89కిలో కేలరీలు ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్ల శాతం చాలా ఎక్కువ. వీటిని ఎక్కువగా తీసుకుంటే తక్కువ సమయంలోనే బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
సీతాఫలం:
వంద గ్రాముల సీతాఫలంలో 94కిలో కేలరీలు ఉంటాయి. అదీగాక చక్కెర శాతం ఇందులో మహా ఎక్కువ. ఎక్కువ మొత్తంలో సీతాఫలాలు తీసుకుంటే బరువు పెరుగుతారు.
ద్రాక్ష:
వంద గ్రాముల ద్రాక్ష పండ్లలో 67కిలో కేలరీలు ఉంటాయి. వీటిని తెలియకుండానే ఎక్కువ తినేస్తారు. తియ్యగా ఉంటాయి కాబట్టి నోటిని కట్టేయలేం. తినేటపుడు ఎంత తినాలో ముందె డిసైడ్ అవ్వండి.
మామిడి పండు:
వంద గ్రాముల మామిడి పండులో 60కిలో కేలరీలు ఉంటాయి. చక్కెర శాతం వీటిల్లో ఎక్కువ. మీరు బరువు తగ్గాలన్న ఆలోచనలో ఉన్నట్లయితే మామిడి పండుకు దూరంగా ఉండటమే మంచిది.
సపోటా:
ఇందులోనూ చక్కెర ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. దీని జ్యూస్ తాగిన వాళ్ళకు ఇందులోని చక్కెర శాతం ఈజీగా అర్థమైపోతుంది. వంద గ్రాముల సపోటాలో 83కిలో కేలరీలు ఉంటాయి.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.