రోజు రోజుకీ బరువు అధికంగా పెరగడం అన్నది నేటి తరుణంలో సహజం అయిపోయింది. చాలా మంది ప్రస్తుతం అధిక బరువు సమస్యతో సతమతమవుతున్నారు. అయితే బరువు అధికంగా పెరగడానికి మనం చేసే తప్పులు కూడా కొన్ని కారణమవుతుంటాయి. ముఖ్యంగా రాత్రి పూట మనం చేసే తప్పుల వల్ల బరువు అధికంగా పెరుగుతాం. అయితే ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని చేయకుండా ఉంటే బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
1. రాత్రిపూట చాలా మంది భోజనం తరువాత, ముందు స్నాక్స్ ఎడా పెడా తింటారు. నిజానికి స్నాక్స్‌ను సాయంత్రం 6 గంటల లోపే తినాలి. ఆరు దాటితే నేరుగా భోజనం చేయాలి. అంతే కానీ స్నాక్స్, జంక్‌ఫుడ్ తినరాదు. తింటే బరువు అధికంగా పెరుగుతారు. ఈ తప్పును ఇకపై ఎవరూ చేయకూడదు.
2. నిద్రపోయేందుకు 6 గంటల ముందే కాఫీ తాగడం మానుకోవాలి. కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ బరువు పెంచుతుంది. ముఖ్యంగా రాత్రి పూట కాఫీ తాగితే బరువు పెరుగుతారు. కాఫీకి బదులుగా హెర్బల్ టీ తాగితే బరువు తగ్గవచ్చు.
3. ప్రతి ఒక్కరు నిత్యం 7 నుంచి 8 గంటల నిద్ర పోవాలి. నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా బరువు పెరుగుతారని సైంటిస్టుల అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక ప్రతి వ్యక్తికి నిద్ర ఆవశ్యకం.
4. నిత్యం కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. ఇది ఎంతో కొంత బరువును తగ్గిస్తుంది. వ్యాయామం చేయకపోతే బరువు పెరుగుతామన్న విషయం గుర్తుంచుకోవాలి.
5. రాత్రిపూట స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల వాడకం తగ్గించాలి. టీవీలను కూడా పొద్దు పోయే వరకు చూడరాదు. చూస్తే నిద్రలేమి సమస్య వస్తుంది. బరువు పెరుగుతారు.
6. రాత్రి త్వరగా నిద్రించి ఉదయం త్వరగా నిద్రలేవాలి. అలాగే నిద్రించే బెడ్‌రూంలో బ్లూ కలర్ లైట్‌ను వాడితే నిద్ర త్వరగా పడుతుంది. దీంతో టైముకు నిద్రపోవచ్చు. బరువు అదుపులో ఉంటుంది.