కేంద్రం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్ : ఎంపీ పురంధేశ్వరి

-

రాజమండ్రిలో కేంద్ర బడ్జెట్ 2025-26 మేధావుల సమావేశం జరిగింది. ఈ సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్ అని అన్నారు. వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్ లో పెద్దపీట వేశారని తెలిపారు. ధన ధాన్య యోజన పథకంతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పప్పు దినుసులు దిగుమతి పెంచుకునేందుకు బడ్జెట్ లో ఆలోచించారని పేర్కొన్నారు.

పంట నష్టపోయినా ఇంట్లో ఉన్న పాడి పశువుల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడానికి గోకుల్ పథకం అందిస్తున్నట్టు పురంధేశ్వరి చెప్పారు. పెట్టుబడి సేకరణకు ప్రత్యేక దృష్టి పెట్టారని, దేశంలో పెట్టుబడులు పెడితే రక్షణ ఉంటుందని తెలిపారు. పెట్టుబడులు రావడానికి మన రాష్ట్రానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని వెల్లడించారు. ప్రపంచం అంతా ఆర్థిక మాన్యం ఎదుర్కొంటున్నా.. మనదేశం 7 శాతం అభివృద్ధిలో ఉందని  పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news