ఈ గింజలను ఉడకపెట్టుకుని తింటే ప్రొటీన్ తో పాటు కండపుష్టి లభిస్తుందట..!

-

పూర్వం రోజుల్లో చిక్కుడు పాదులు లేని ఇళ్లు అంటూ ఉండేది కాదు. చిక్కుడు కాయలో అనేక ఔషధగుణాలు, పోషకాలు దాగి ఉన్నాయి. ఈరోజు చిక్కుడుకాయలో ఉన్న పోషకాలు, ఆరోగ్యానికి ఇది ఎంత మేలు చేస్తుంది అనేది తెలుసుకుందాం.

100గ్రాముల పచ్చిచిక్కుడు కాయల్లో ఉండే పోషకాలు

నీరే 84 గ్రాములు ఉంటుంది.
శక్తి 29 కాలరీల ఉంటుంది
ప్రోటీన్ 4 గ్రాములు ఉంటుంది.
పిండిపదార్థాలు 2 గ్రాములు ఉంటాయి.
ఫ్యాట్ అసలు ఉండదు
ఫైబర్ 9 గ్రాముల ఉంటుంది. ఏ కూరగాయలోనూ ఇంత ఫైబర్ ఉండదు.
కాల్షియం64 మిల్లీగ్రాములు ఉంటుంది
విటమిన్ D2 11మైక్రోగ్రామ్స్ ఉంటుంది
ఫోలిక్ యాసిడ్ 20-40 గ్రాముల మైక్రోగ్రామ్స్ ఉంటుంది.

సీజనల్ గా వచ్చినప్పుడు చిక్కుడు కాయలను బాగా తినాలి. వేసవికాలం వరకూ ఇ‌వి అందుబాటులో ఉంటాయి. అయితే చిక్కుడు కాయలో కొందరు పైన తోలు తినరు. మరికొందరు గింజలు తినరు. రెండు తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటో చూద్దాం.

చిక్కుడు కాయలో Lడొపా అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది మనలోపలి వెళ్లాక డొపమిన్ గా మారుతుంది. ఇది హ్యాపీహార్మోన్. ఇది పెరిగిందంటే..శరీరానికి చాలా చాలా లాభాలు. మనం కాస్త టెన్షన్ గా ఉన్నా, స్ట్రస్ లో ఉన్నా..చిక్కుడు కాయ తింటం వల్ల ఈ డొపమిన్ అనే హార్మోన్ రిలీజ్ అవటం వల్ల మనసుకు చాలా హాయిగా ఉంటుంది..న్యూరోట్రాన్సిమిషన్ కి డొపమిన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ డొపమిన్ హార్మోన్ సరిగ్గా లేనప్పుడు పార్కిన్ సన్ అనే జబ్బు వస్తుంది. పార్కిన్ సన్ అంటే..వణుకు వస్తుంది. కొందరికి మాట వణుకుతుంది. తల ఊగుతుంది. కొన్నాళ్లుకు నడవడానకి కూడా తోడు కావాలి.

కెరిటినాయిడ్ కాంపౌండ్స్ అనేవి స్పెషల్ గా ఉన్నాయి. ఇవి ఉండటం వల్ల గ్లుటాతియోన్ అనే ప్రొడెక్షన్ పెరుగుతుంది. లివర్ లో ఈ ప్రొడెక్షన్ పెరిగితే..డీటాక్సిఫికేషన్ కు చాలా ఉపయోగపడుతుంది. 1993లో చేసిన పరిశోధనలో ఈ నిజాలన్నీ తేల్చారు.

ఇది బోన్ హెల్త్ కు మంచిదని, ఫైబర్ ఇంత ఎక్కువ ఉంది కాబట్టి మోషన్ ట్రబుల్ ఉన్నవారికి చిక్కుడుకాయలు తింటే..క్లీన్ మోషన్ అవుతుంది. ఇంత మేలు చేసే చిక్కుడుకాయను పూర్తిగా తిన్నప్పుడే లాభం మొత్తం పొందగలుగుతాం. కాబట్టి తొక్కలు, గింజలు రెండు తినాలి.

చిక్కుడుగింజలు తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది అనడంలో ఎంత వరకు నిజం ఉంది.

గ్యాస్ రావడం అనేది చిక్కుడుగింజల్లో కరెక్టే. ఇందులో ఒలిగోశాకరాయిడ్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది గ్యాసెస్ ను సహజంగా రిలీజ్ చేస్తుంది. ఈ డైజెషన్ అయ్యేప్పుడు రిలీజ్ అయ్యే గ్యాస్ ఇతర కూరగాయలు తిన్నప్పుడు రాదు కానీ..చిక్కుడుగింజలు తిన్నప్పుు ఎక్కువగా వస్తుంది. తొక్కలో ఎక్కువలాభం ఉండదు. అసలైన లాభాలు అన్నీ గింజల్లోనే ఉన్నాయి. నీళ్లు బాగా తాగండి. ఈ సమస్య రాదు.

ఎండిపోయిన చిక్కుడు గింజలను ఎలా వాడుకోవాలంటే:

ఊర్లలో చిక్కుడు పాదులు వేసినప్పుడు అవి పక్కన చెట్లమీదకు పాకి మనకు కోయడానికి అందకుండా పోతాయి. అలా వదిలేస్తే..అవి ముదిరిపోతాయి. సీజన్ అయిపోయిన తర్వాత ఆ పాదు తీసేస్తారు. అప్పుడు ఈ ముదిరిపోయిన గింజలను అన్నింటిని తీసి ఎండపెట్టండి.

ఎండిన గింజల్లో 88 కాలరీల శక్తి ఉంటుంది. వీటిలో ముందు చెప్పిన అన్నీ పోషకాలు పెరుగుతాయి. వీటిని 10-12 గంటలు నానపెట్టి కూరల్లో వేసి వండుకోవచ్చు. మసాల కూరలు కూడా చేసుకోవచ్చు. చిక్కుడు గింజలు తినడం వల్ల గర్భిణీలకు మంచిది, బాలింతలకు పాలు వస్తాయి, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్లకు కండపుష్టికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి చిక్కుడుకాయను తినని వారుంటే..ఇకనుంచైనా తినటం అలవాటు చేసుకోండి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version