చిన్న పిల్లల ఒంటి మీద జుట్టు తొలగించడానికి కెమికల్ ప్రోడక్ట్స్ ని ఉపయోగించద్దు. ఇంటి చిట్కాలను పాటిస్తే జుట్టును తొలగించొచ్చు. ఇంటి చిట్కాల వల్ల ఎటువంటి అనారోగ్యం రాదు. పైగా కెమికల్స్ లేనివి వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలగదు. చాలా సార్లు గమనించే ఉంటారు అప్పుడే పుట్టిన పిల్లలకు ఒంటి మీద జుట్టు ఉంటుంది. వీటిని చూసి తల్లులు సమస్య అని భయపడుతూ ఉంటారు.
శనగపిండి:
శనగపిండిని ఒంటి మీద రాసి ఆ తర్వాత వరి పిండి తో నలచండి. ఇలా చేయడం వల్ల జుట్టు సాఫ్ట్ గా అయ్యి ఆటోమేటిక్ గా ఊడిపోతుంది.
బాడీ స్క్రబ్ :
దీని కోసం మీరు కొద్దిగా చందనం పొడి తీసుకోండి. దానిలో కొద్దిగా పాలు, కొంచెం పసుపు వేసి జుట్టు ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి. స్నానం చేయడానికి ఒక రెండు గంటల ముందు ఇలా చేయండి. ఆ తర్వాత స్నానం చేయించండి. ఇలా కొన్ని వారాల పాటు ఈ పద్ధతిని అనుసరించండి. దీనితో జుట్టు ఊడిపోతుంది.
ఆలివ్ ఆయిల్:
ముందు ఆలివ్ ఆయిల్ ని ఒంటి మీద మసాజ్ చేయండి. ఆ తర్వాత ఎర్ర కందిపప్పు మరియు పాలు కలిపి పేస్ట్ చేసి దానిని ఒంటికి అప్లై చేయండి. దీనివల్ల జుట్టు తొలగిపోతుంది.
పాలు మరియు పసుపు:
పాలు పసుపు కలిపి మసాజ్ చేయడం వల్ల కూడా జుట్టు తొలగిపోతుంది. అది ఎండిపోయిన తర్వాత మెత్తటి టవల్ ని పాలల్లో ముంచి క్లీన్ చెయ్యండి. ఇలా చేసిన తర్వాత సబ్బు రుద్దకుండా స్నానం చేయించండి. దీనివల్ల కూడా జుట్టు తొలగిపోతుంది.
బేబీ ఆయిల్:
ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా బేబి ఆయిల్ తో మసాజ్ చేయండి. దీని వల్ల కూడా జుట్టు తొలగిపోతుంది. పిల్లల చర్మం నాజూకుగా ఉంటుంది అందుకోసం కెమికల్ ప్రొడక్ట్స్ ని ఉపయోగించకుండా ఈ నేచురల్ రెమడీస్ ను అనుసరించండి.