Hyderabad: మహిళా జర్నలిస్ట్‌పై ప్రిజం పబ్ మేనేజ్‌మెంట్ దాడి జరిగింది. పబ్ వద్ద ఒక దొంగ కాల్పులు జరిపిన నేపథ్యంలో.. అక్కడికెళ్లి రిపోర్ట్ చేశారు ఆర్టీవీ మహిళా జర్నలిస్టు. ఈ తరుణంలోనే.. ఆమెతో వాగ్వాదానికి దిగిన పబ్ మేనేజ్‌మెంట్… జర్నలిస్ట్, కెమెరామ్యాన్‌పై దాడి చేసింది. ఇక ఈ సమాచారం అందుకొని.. రంగంలోకి పోలీసులు దిగారు. దాడికి పాల్పడ్డ ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు.
అటు గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ అరెస్ట్ అయ్యాడు. ప్రిజం పబ్ దగ్గర పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపాడు దొంగ. కాల్పుల్లో మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికు, ఓ బౌన్సర్‌కు గాయాలు అయ్యాయి. ఈ తరుణంలోనే… దొంగను పట్టుకున్నారు పోలీసులు. ఆ దొంగ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అని సమాచారం అందుతోంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ది చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామం అని పోలీసులు చెబుతున్నారు. బత్తుల ప్రభాకర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా చోరీ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని సమాచారం.
మహిళా జర్నలిస్ట్‌పై ప్రిజం పబ్ మేనేజ్‌మెంట్ దాడి
పబ్ వద్ద ఒక దొంగ కాల్పులు జరిపిన నేపథ్యంలో..
అక్కడికెళ్లి రిపోర్ట్ చేసిన ఆర్టీవీ మహిళా జర్నలిస్టు
ఆమెతో వాగ్వాదానికి దిగిన పబ్ మేనేజ్‌మెంట్
ఈ క్రమంలోనే.. జర్నలిస్ట్, కెమెరామ్యాన్‌పై దాడి
సమాచారం అందుకొని.. రంగంలోకి పోలీసులు… pic.twitter.com/pPRKAjEBBM
— Pulse News (@PulseNewsTelugu) February 1, 2025