మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? బరువు తగ్గాలి అని లావుగా ఉన్న ప్రతి ఒక్కరు అనుకుంటారు..కానీ ఎలా తగ్గాలి, ఏం చేస్తే బరువు తగ్గుతారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. బరువు తగ్గడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గడానికి పండ్లు తప్పనిసరిగా మీ డైట్‌లో చేర్చుకోవాలి. సహజ చక్కెరలను కలిగి ఉన్న పండ్లు, తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటాయి, ఆకలిని అరికట్టడంలో సహాయపడతాయి. బరువు తగ్గడంలో సహాయపడే పండ్లు ఇవే..
యాపిల్స్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. యాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే యాపిల్స్‌ను వాటి తొక్కతో కలిపి తింటే మంచిది. రోజూ ఒక ఆపిల్ స్మూతీ లేదా సలాడ్ తినండి.
బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బెర్రీలు ఆకలిని తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటును తగ్గిస్తాయి. ఒక కప్పు స్ట్రాబెర్రీలో కేవలం 50 కేలరీలు మాత్రమే ఉంటాయి.
మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే చెర్రీస్ మంచి ఎంపిక.. ఎందుకంటే వాటిలో కేలరీలు మరియు చక్కెర చాలా తక్కువగా ఉంటాయి.
ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇందులో నీరు ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. పుచ్చకాయలో ప్రయోజనకరమైన సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి ఆకలిని నియంత్రించడంలో మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఒక పాషన్ ఫ్రూట్‌లో (కృష్ణఫలం) ఎనిమిది గ్రాముల ఫైబర్ ఉంటుంది. పాషన్ ఫ్రూట్ అధిక రక్తపోటును తగ్గించడానికి మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గడంలో సహాయపడే మరో పండు అవకాడో. విటమిన్ కె, ఫోలేట్, విటమిన్ సీ, పొటాషియం, విటమిన్ ఇ ఉన్నాయి.
వీటిని మీ డైట్‌లో భాగం చేసుకుంటే.. మీకు వేరే ఆహారం తినాలి అనిపించదు.. కడపు నిండుగా ఉంటుంది. కాబట్టి ఇతర ఆహారాలు తినరు.. సహజంగా బరువు తగ్గిస్తుంది.