ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి తాజాగా బయటకు వస్తాం. ఆ తర్వాత మన శరీరాన్ని తుడవడానికి ఉపయోగించే టవల్‌పై ఎంత శ్రద్ధ పెడుతున్నాం? మురికి దుస్తులను ప్రతిరోజూ ఉతుకుతాం, కానీ టవల్‌ను మాత్రం వారం రోజులైనా మార్చకుండా వాడుతుంటాం. ఈ అలవాటు మన ఆరోగ్యానికి చాలా పెద్ద ప్రమాదం అని మీకు తెలుసా? పొడిబారే టవల్ కాదు, అది మీ చర్మానికి హాని చేసే బ్యాక్టీరియా మరియు ఫంగస్‌కు స్థావరంగా మారుతుంది. ఈ చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ముప్పుగా మారుతుందో తెలుసుకుందాం.
మీ టవల్ కేవలం నీటిని మాత్రమే కాదు, మీ శరీరం నుండి రాలిన చర్మ కణాలు, నూనెలు మరియు క్రిములను కూడా గ్రహిస్తుంది. టవల్ బాత్‌రూమ్‌లో తేమగా ఉన్న వాతావరణంలో వేలాడుతున్నప్పుడు అది బ్యాక్టీరియా మరియు ఫంగస్‌కు సంతానోత్పత్తి కేంద్రంగా మారుతుంది. టవల్ ఎక్కువ రోజులు మార్చకుండా వాడటం వల్ల వచ్చే రిస్క్‌లు తెలుసుకోవటం ముఖ్యం.
చర్మ ఇన్ఫెక్షన్లు (Skin Infections): టవల్‌పై పెరిగే స్టెఫిలోకాకస్ (Staph) బ్యాక్టీరియా, లేదా ఫంగస్ కారణంగా తామర (Ringworm), దురద (Itching), లేదా దద్దుర్లు (Rashes) వంటి చర్మ సమస్యలు వస్తాయి.
మొటిమలు (Acne): టవల్‌పై పేరుకుపోయిన మురికి, నూనెలు మళ్లీ ముఖానికి, శరీరానికి అంటుకోవడం వల్ల మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ సమస్య పెరుగుతుంది.
దుర్వాసన: టవల్‌లో తేమ, బ్యాక్టీరియా కలవడం వల్ల దాని నుండి చెడు వాసన వస్తుంది. ఆ వాసన నిజానికి క్రిములు వృద్ధి చెందుతున్నాయనడానికి సంకేతం.

ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి: ఇంట్లో ఒకే టవల్ ను ఇద్దరు లేదా ఎక్కువ మంది వాడితే, ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ్యాప్తి చెందుతాయి.
టవల్ ఎప్పుడు మార్చాలి?: టవల్ శుభ్రతను పాటించడం చాలా సులభం. బాడీ టవల్ సాధారణంగా స్నానం చేయడానికి ఉపయోగించే టవల్‌ను ప్రతి 3 లేదా 4 సార్లు వాడిన తర్వాత ఉతకడం ఉత్తమం. జిమ్‌కు వెళ్లి బాగా చెమట పట్టినప్పుడు ప్రతి 1-2 సార్లు వాడిన వెంటనే మార్చాలి.
ముఖం టవల్ (Face Towel): ముఖం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి, ముఖం తుడుచుకునే టవల్‌ను ప్రతిరోజూ మార్చడం లేదా ఉతకడం చాలా అవసరం.
టవల్ ఆరబెట్టడం: వాడిన వెంటనే టవల్‌ను బాగా గాలి తగిలే ప్రదేశంలో పూర్తిగా ఆరేలా వేయండి. తేమ లేకపోతే క్రిముల పెరుగుదల తగ్గుతుంది.
టవల్ ఉతికేటప్పుడు, క్రిములు పూర్తిగా నశించడానికి వేడి నీటిని మరియు మంచి క్రిమిసంహారక డిటర్జెంట్‌ను ఉపయోగించండి. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత టవల్ ఉండేలా చూసుకోవడం కుటుంబ ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
