బరువు పెరగాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి

-

లావుగా ఉన్నవాళ్లకు బరువు తగ్గాలని సకల ప్రయత్నాలు చేస్తుంటారు. అదే బక్కగా ఉన్నవాళ్లు కొంచెం లావుగా ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి.. ‘‘ అరే.. బరువు పెరగాలంటే ఏం చేయాలి రా..’’ అని అడిగేస్తుంటారు. అప్పుడా ఫ్రెండ్..‘‘ బరువు తగ్గాలంటే నానా కష్టాలు పడాలి కానీ.. పెరగడం ఎంత సేపు రా.. రోజూ పుష్టిగా తిని కూర్చో ఆటోమెటిక్ గా బరువు పెరుగుతావ్’’ అని సింపుల్ గా సజేషన్ ఇచ్చేస్తుంటారు. అయితే ఈ ప్రక్రియ కొందరికి సులువే. కానీ మరికొందరికి ఎంతో కష్టం. ఎంత ఆహారాన్ని తీసుకున్నా సన్నగానే కనబడుతారు. తిని కూర్చోని బరువు పెరగాలని భావించే వారూ జర భద్రం. ఆరోగ్య పద్ధతులు పాటించకుండా బరువు పెరిగే ఆరోగ్య సమస్యలు తలెత్తె ప్రమాదం ఉంది. ఆరోగ్యకరమైన పద్ధతులు పాటిస్తూ సులువుగా బరువు పెరిగేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు కొన్ని సలహాలు అందించారు. అవేంటో తెలుసుకుందాం రండి.

weight gain

ఖర్జూర పండ్లు చేసే మేలు..
ఖర్జూర పండ్లు బరువు పెరిగేందుకు ఎంతో మేలు చేస్తుంటాయి. ఇందులో విటమిన్లు ఏ, సీ, ఇ, కే, బీ2, బీ6, థయామిన్, నియాసిన్ అధికంగా ఉంటాయి. వీటితోపాటు ప్రోటీన్, చక్కెర శాతం కూడా అధికమే. అనవసరమైన కొవ్వు పేరుకోపోకుండా మంచి కొవ్వును అందిస్తుంది. ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే బరువుతో పాటు కండరాలు కూడా ధృడంగా మారుతాయి.

వెన్నతో మిన్న..
ఒక చెంచాడు వెన్నకు ఓ చెంచాడు చక్కెరను కలిసి రోజూ ఆహారంగా తీసుకోండి. ఇలా నెలరోజుల పాటు వెన్న, చక్కెర మిశ్రమాన్ని తీసుకోవడం ద్వారా సులభంగా బరువు పెరుగుతుంటారు. వెన్నలో బరువు పెంచేందుకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి.

మామిడి పండుతో..
మామిడి పండ్లలో కార్బోహైడ్రేట్స్, చక్కెర, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటితో కండరాలు సులభంగా బరువు పెరుగుతాయి. త్వరగా బరువు పెరగాలంటే మామిడి పండును తిన్న తర్వాత వేడి వేడి పాలను తాగండి. అలా చేస్తే తొందరగా ప్రభావం కనిపిస్తుంది.

వేరుశనగ చేసే మేలు..
వేరుశనగలో ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు అధిక మోతాదులో ఉంటాయి. పీనట్ బటర్ ను బ్రెడ్ పై రాసుకుని బ్రేక్ ఫాస్ట్ చేస్తే సులభంగా బరువు పెరుగుతారు. టీ, కాఫీలను దూరంగా ఉంటూ.. రోజూ ఉదయం వ్యాయామం చేయాలని, కంటి నిండా కునుకేయాలని నిపుణులు పేర్కొంటున్నారు. అలా చేస్తే సులభంగా బరువు పెరుగుతారని వారు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version