మానసిక ఆరోగ్యం మన ఆలోచనలను,భావోద్వేగాలను మన ప్రవర్తనని ప్రభావితం చేస్తుంది. మంచి మానసిక ఆరోగ్యం మనల్ని పాజిటివ్ గా ఉంచి రోజువారి ఒత్తిళ్ళను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. అయితే కొన్ని లక్షణాలు మానసిక ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. మానసికంగా ఆరోగ్యం సరిగా లేకపోతే ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధమైన లక్షణాలు కనిపించవచ్చు. అలాంటి లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే వాటిని గుర్తించి దగ్గరలో వైద్య నిపుణులతో చర్చించి సమస్య ఎక్కువ కాకుండా ముందే నివారించవచ్చు మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందామా..
శారీరకంగా మన అవయవాలలో కన్ను, కాలు, చెవి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి వెంటనే అర్థమయిపోతుంది. మరి మన మనసుకి ప్రాబ్లం వచ్చిందని మనకు ఎలా అర్థమవుతుంది. దుఃఖం అవును మీరు వింటున్నది నిజమే,మనం బాగా బాధపడుతుంటే మానసికంగా కృంగిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. దుఃఖంలో ఉండడం, ఉత్సాహం లేకపోవడం, ఏ విషయానికి శ్రద్ధ చూపించలేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న లక్షణాలను మనం ముందే గుర్తిస్తే మన మానసిక ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకోవచ్చు.
కొంతమందిలో ఎప్పుడూ బాధపడుతూ ఉండడం,నేనేదో తప్పు చేశాను అనే భావనని నిత్యం ఆలోచించుకుంటూ ఉండటం తీవ్రమైన ఒత్తిడికి లోనవడం, భావోద్వేగాలని మన అదుపులో లేకుండా ఏడవటం, భయాలు ప్రతి చిన్న దానికి అనుమానాలు,దేని గురించి పూర్తిగా మనసుపెట్టి పని చేయలేకపోవడం వంటి లక్షణాలు కొందరిలో కనిపిస్తాయి.
ఇంకొంతమందిలో ఎదుటివారి గురించి తప్పుగా అర్థం చేసుకోవడం వారి గురించి బ్రమపడటం ఒంటరిగా ఒకే చోట కూర్చోవడం,ఎవరైనా దగ్గరికి వస్తే దూరంగా వెళ్లడం,వెంటనే కోపం ఉన్నట్టుండి హద్దులు దాటి ప్రవర్తించడం ఏ పనిలో ఆసక్తి లేకపోవడం,చివరికి తిండి కూడా తినలేకపోవడం, నిద్ర కూడా పట్టకుండా ఆలోచిస్తూ ఉండడం ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే దగ్గరలోని ఆరోగ్య నిపుణులను సలహాలు తీసుకొని, సమస్యను నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకోవడం ముఖ్యం.
గమనిక: (పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఎలాంటి మానసిక ఆరోగ్య సమస్యలు మీకు కలిగిన లేదా నీ ఎదుటి వారికి కనిపించిన వెంటనే వైద్య నిపుణుల సలహాలు తీసుకోండి.)