యూపీఏ హయాంలో భారత్ లో వందలాది మంది చనిపోయారని రాజ్యసభలో సభ నాయకుడు జేపీ నడ్డా ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే ముంబై దాడులు, పాకిస్తాన్ ఉగ్రవాదులను జైలులో పెంచి పోషించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. పహల్గామ్ లో ఉగ్రవాదులు చేసిన దాడికి ఆపరేషన్ సిందూర్ తో వారికి సరైన సమాధానం చెప్పింది భారత్ అని తెలిపారు.
ముఖ్యంగా సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేసి పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని వదిలిపెట్టేంత వరకు ఆ నిలిపివేత కొనసాగుతుందని తెలిపారు. ఈ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో అధికారంలో ఉన్నవారు భారత రైతుల కంటే పాకిస్తాన్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలను తప్పు పెట్టారు.