వ్యాయామం లేకుండా బరువు తగ్గాలనుకునే వారికోసం అద్భుత చిట్కాలు..

-

బరువు తగ్గాలనుకునే ప్రతీ ఒక్కరూ వ్యాయామం ఖచ్చితంగా చేయాలని చెబుతుంటారు. డైట్ ఎంత పాటించినా వ్యాయామం లేకుండా బరువు తగ్గడం అసాధ్యం అని చాలామంది గొంతు వినిపిస్తుంటారు. కానీ, మీకిది తెలుసా? వ్యాయామం చేయకుండా, ఎలాంటి వర్కౌట్స్ చేయకుండా కూడా బరువు తగ్గొచ్చు. దానికోసం కొన్ని నియమాలని పాటించాల్సి ఉంటుంది. ఆ నియమాలేంటో తెలుసుకుని శరీరంలోని అధిక బరువును కరిగించేద్దాం.

వ్యాయామం /Exercise

మీ ఆహారం మీరే వండుకోండి.

ఇలా చెప్పడం వల్ల పరోక్షంగా వ్యాయామం చేసినట్టే అవుతుందని అనుకుంటున్నారా? నిజానికి అది కాదు. మీ ఆహారం మీరే వండుకోవడం వల్ల ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటున్నారనే దానిలో స్పష్టత ఉంటుంది. అంతేకాదు వండుకోవడం వల్ల తక్కువ తింటారు. ఆరోగ్యమైన ఆహారాన్ని తింటారు.

మెల్లగా తినండి

మీరు నమ్మినా నమ్మకపోయినా ఫాస్ట్ గా తినడం వల్ల కేలరీలు పెరుగుతాయి. అందుకే మెల్లగా తినడం అలవాటు చేసుకోండి. మనస్ఫూర్తిగా ఫీలవుతూ ఆహారాన్ని ఆస్వాదించండి. దానివల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారాలనే తినండి

మీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలనే తీసుకోండి. కొవ్వు పెంచే నూనెలు, స్నాక్స్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలను ముట్టుకోవద్దు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం.

తక్కువ ఒత్తిడి, ఎక్కువ నీళ్ళు

ఒత్తిడి పెంచుకోవద్దు. మీపై ఒత్తిడి మీ శరీరం మీద ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి అది ఎక్కువ తినేలా చేస్తుంది. దానివల్ల బరువు పెరుగుతారు. అందుకే ఒత్తిడిని దూరం చేసుకోండి. అలాగే కావాల్సినన్ని నీళ్ళు తాగండి.

చిరుతిళ్ళను మానివేయండి

టీవీ ముందు కూర్చుని చకచకా చిరుతిళ్ళను తినవద్దు. వాటికి బదులు డ్రైఫ్రూట్స్, మొలకలు, తక్కువ కేలరీలు కలిగిన ఆహారాలను తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version