చింతపండుతో ఈ సమస్యలకి చెక్..!

-

చింతపండు(Tamarind) వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అలానే దీనివల్ల వంటకి మంచి రుచి కూడా వస్తుంది. అయితే చింతపండు గురించి చాలా మందికి ఈ విషయాలు తెలియక పోవచ్చు. నిజంగా అనుకున్న వాటి కంటే ఎక్కువ లాభాలు చింత… వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అలానే దీనివల్ల వంటకి మంచి రుచి కూడా వస్తుంది. అయితే చింతపండు గురించి చాలా మందికి ఈ విషయాలు తెలియక పోవచ్చు. నిజంగా అనుకున్న వాటి కంటే ఎక్కువ లాభాలు చింతపండు వల్ల మనకి కలుగుతాయి. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం మనం ఇప్పుడే చూద్దాం.

చింతపండు/ Tamarind

చింతపండుతో చట్నీ, సాస్ వంటివి తయారు చేస్తూ ఉంటారు. నిజంగా దీనిని వంటల్లో వేస్తె రుచి అద్భుతంగా ఉంటుంది. చింతపండు తినడం వల్ల అజీర్ణ సమస్య నుండి గుండె సంబంధిత సమస్యలు వరకు ఎన్నో సమస్యలకు మనం చెక్ పెట్టొచ్చు. ఇక మనం వాటి కోసం తెలుసుకుందాం.

చింతపండులో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ ఉంటాయి. అదే విధంగా యాంటీఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.

బరువు తగ్గొచ్చు:

బరువు తగ్గడానికి చింతపండు బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది కొవ్వు అస్సలు ఉండదు. చింతపండులో హైడ్రాక్సీ సిట్రిక్ ఆసిడ్ ఉంటుంది.

డయాబెటిస్ పేషెంట్లుకి మంచిది:

చింతపండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ ని తగ్గించడంలో ఇది ఎంతో మేలు చేస్తుంది.

రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది:

చింతపండు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. చింతపండు తీసుకోవడం వల్ల చర్మం గ్లో పెరుగుతుంది మరియు జుట్టు షైనీగా ఉంటుంది.

జీర్ణ సమస్యలను పోగొడుతుంది:

పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్న చింతపండులో అజీర్తి సమస్యలను పోగొట్టే గుణాలు ఉంటాయి. దీనితో మోషన్స్ కూడా తగ్గుతాయి. ఇలా చింతపండుతో ఎన్నో ప్రయోజనాలని మనం పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version