యాంటి ఆక్సిడెంట్స్ అంటే ఏంటి..? ఇవి మన శరీరానికి అంత అవసరమా..?

-

యాంటి ఆక్సిడెంట్స్: మనం తినే ఎన్నో ఆహారాలు నేడు కలుషితం అవుతున్నాయి.. మన కంటికి కనిపించింది అంతా మంచిదే అనుకుంటున్నారు..పాడైనట్లు చూస్తే కానీ.. అవి పడేస్తున్నాం.. కానీ అప్పటికే కలుషితం అయినవి, దెబ్బతిన్నవి, నకిలీవి ఇలా ఎన్నో నిత్య జీవితంలో మ‌న శ‌రీరం ఎన్నో విష ప‌దార్థాల ప్ర‌భావం బారిన ప‌డుతుంటుంది. ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యంతోపాటు క‌ల్తీ అయిన ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో విష ప‌దార్థాలు పేరుకుపోతాయి. దీంతో పాటు ఫ్రీ ర్యాడిక‌ల్స్ ఉత్ప‌న్నం అవుతాయి. ఇవి క‌ణాల‌ను దెబ్బ తీస్తాయి. దీర్ఘ‌కాలికంగా ఫ్రీ ర్యాడిక‌ల్స్ బారిన ప‌డితే డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

 

ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను మ‌న శ‌రీరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నాశ‌నం చేస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. కానీ యాంటీ ఆక్సిడెంట్లు త‌గినంత‌గా లేక‌పోతే శ‌రీరం ఫ్రీ ర్యాడిక‌ల్స్ బారిన ప‌డుతుంది. అందువ‌ల్ల యాంటీ ఆక్సిడెంట్లు మ‌న‌కు రోజూ కచ్చితంగా కావ‌ల్సిందే. ప‌లు ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి యాంటీ ఆక్సిడెంట్లు ల‌భిస్తాయి. విట‌మిన్ సి, ఇ, ఎ లు యాంటీ ఆక్సిడెంట్ల‌లా ప‌నిచేస్తాయి. అందువ‌ల్ల ఈ విట‌మిన్లు ఉండే ఆహారాల‌ను రోజూ తినాలి.

ఇవే కాకుండా ప‌లు ర‌కాల ప‌దార్థాల్లో భిన్న ర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవ‌న్నీ మ‌న‌కు అవ‌స‌ర‌మే. నిమ్మ జాతికి చెందిన పండ్లు, న‌ట్స్‌, గ్రీన్ టీ, ల‌వంగాలు, దాల్చిన చెక్క‌, యాల‌కులు, ట‌మాటాలు, బెర్రీలు, ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, ప‌సుపు, నారింజ‌, స్ట్రాబెర్రీలు, కివీలు, క్యారెట్లు, వెల్లుల్లి, మామిడి పండ్లు, జామ‌కాయ‌లు, ద్రాక్ష‌, గుమ్మ‌డి కాయ విత్త‌నాలు వంటి వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని రోజూ తీసుకుంటే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేయ‌వ‌చ్చు.

ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకోవ‌చ్చు. శరీరంలో ఉండే విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version