ఆయుర్వేద ప్ర‌కారం.. పాల‌ను ఎప్పుడు తాగితే మంచిదో తెలుసా….?

-

ఆయుర్వేద ప్ర‌కారం మ‌నం తీసుకునే ఉత్త‌మ‌మైన ఆహారాల్లో పాలు కూడా ఒక‌టి. నిత్యం ప్ర‌తి ఒక్క‌రు పాలు తాగితే ఎన్నో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. అయితే పాలు తాగే విష‌యంలో చాలా మందికి ఎదుర‌య్యే సందేహం ఒక్క‌టే. అదేమిటంటే.. పాల‌ను ఉద‌యం తాగాలా, సాయంత్రం లేదా రాత్రి పూట తాగాలా అని చాలా మంది సంశ‌యిస్తుంటారు. మ‌రి అందుకు ఆయుర్వేద వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..!

పాల‌ను ఉద‌యం పూట అస్స‌లు తీసుకోరాదు. ఎందుకంటే.. పాలను ఉదయాన్నే తాగితే జీర్ణం అవ‌డం చాలా క‌ష్టం. అసిడిటీ, గ్యాస్ వస్తాయ‌ట‌. దీనికి తోడు పాల‌లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన సెర‌టోనిన్ మ‌న‌కు నిద్ర వ‌చ్చేలా చేస్తుంది. క‌నుక ఉద‌యాన్నే పాల‌ను తాగితే మ‌త్తుగా అనిపిస్తుంది. పనిచేసేవారికి, కాలేజీలు, స్కూల్స్‌కు వెళ్లేవారికి ఇది మంచిది కాదు. క‌నుక ఎవ‌రైనా సాయంత్రం లేదా రాత్రి పూట పాల‌ను తాగాలి. దీని వ‌ల్ల నిద్ర కూడా చ‌క్క‌గా వ‌స్తుంది. పాలు జీర్ణం కూడా అవుతాయి. అలాగే పాల‌లో ఉండే కాల్షియాన్ని కూడా శ‌రీరం తేలిగ్గా శోషించుకుంటుంది.

ఇక పాల‌ను తాగేట‌ప్పుడు ఉప్పుగా సాల్టీ ఫుడ్స్‌, ప‌రాటాలు, చాయ్‌, బ్రెడ్‌, వెన్న వంటివి తీసుకోరాదు. దాని వ‌ల్ల జీర్ణాశ‌యం భార‌మ‌వుతుంది. తిన్న ఆహారం జీర్ణం అవడం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. అలాగే 5 సంవ‌త్స‌రాల లోపు ఉన్న పిల్ల‌ల‌కు అయితే ఉద‌యాన్నే పాల‌ను ఇవ్వ‌వ‌చ్చు. కానీ 5 ఏళ్లు మించిన వారు మాత్రం రాత్రి పూట పాల‌ను తాగ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని ఆయుర్వేదం చెబుతోంది. క‌నుక ఎవ‌రైనా ఉద‌యాన్నే పాలు తాగే అల‌వాటు ఉంటే దాన్ని రాత్రి పూట‌కు మార్చుకోవ‌డం బెట‌ర్‌..!

Read more RELATED
Recommended to you

Exit mobile version