రియల్ ఎస్టేట్ కుదేల్.. అప్పుల బాధ భరించలేక బిల్డర్ ఆత్మహత్య

-

తెలంగాణలో ఏడాది కాలంలోనే రియల్ ఎస్టేట్ డౌన్ కావడంతో ప్రాజెక్టులు లేక ఓ రియల్ బిల్డర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మ‌ృతుడు ఎనిమిదేండ్లుగా నిర్మాణ రంగంలో రాణిస్తున్న వేణుగోపాల్ రెడ్డిగా గుర్తించారు. రియల్ ఎస్టేట్ పడిపోయి బ్యాంకు రుణాలు, అప్పులు-ఒత్తిడి పెరగడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.

స్థానికుల కథనం ప్రకారం..మేడ్చల్ జిల్లా పరిధిలోని కొంపల్లిలో ముత్యాల వేణుగోపాల్ రెడ్డి (39) నివాసం ఉంటున్నాడు.ఆయన ఒక బిల్డర్. ఇటీవల రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.రెండేండ్ల కిందట గుండ్లపోచంపల్లిలో 480 చదరపు గజాల విస్తీర్ణంలో ఐదంతస్తుల అపార్ట్‌మెంట్ నిర్మాణాన్ని వేణుగోపాల్ మొదలుపెట్టారు..దీనికోసం పలు బ్యాంకుల నుంచి,ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశారు.

అపార్ట్‌మెంట్లో పది ఫ్లాట్లు అమ్మితే అప్పులన్నీ తీరి ఆర్థికంగా లాభపడతానని ఆశించాడు. కానీ ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నా మూడు ఫ్లాట్లు మాత్రమే బుక్ అయ్యాయి. దీంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి మరింత పెరిగి తన అపార్ట్‌మెంట్ నిర్మాణం వద్ద ఏర్పాటు చేసుకున్న కార్యాలయంలోనే వేణుగోపాల్ రెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version