WHO : ఆరోగ్యం బాగుండాలంటే ఆహార పదార్థాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుపోతే కచ్చితంగా అనారోగ్య సమస్యలు వచ్చి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్ని ఆహార పదార్థాలని అస్సలు తీసుకోకూడదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. ఈ పది రకాలను తీసుకోకపోవడమే మంచిదని సూచిస్తోంది.
పంచదార
పంచదార ఊబకాయనకి దారితీస్తుంది. డయాబెటిస్ కి స్వాగతం పలుకుతుంది. ఎక్కువ పంచదారని ఉపయోగించడం వలన ఒత్తిడి, లివర్, ప్యాంక్రియాస్, అజీర్తి సమస్యలు కలుగుతాయి. పంచదార పూర్తిగా మానేయక్కర్లేదు. కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది.
ఫ్రై చేసిన ఆహార పదార్థాలు
ఫ్రై చేసిన ఆహార పదార్థాలలో క్యాలరీలు, సాల్ట్, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. దీంతో గుండె సమస్యలు తలెత్తుతాయి.
పాస్తా, బ్రెడ్
పాస్తా, బ్రెడ్ వంటి వాటిల్లో ఉండే పదార్థాలు షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి. ఇన్సులిన్ లెవెల్స్ ని కూడా పెంచేస్తాయి.
కాఫీ
కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో తలనొప్పి, డిప్రెషన్, నిద్రలేమి, హైబీపీ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కాఫీ ని కూడా లిమిట్ గా తీసుకోవాలి.
ఉప్పు
ఉప్పు కచ్చితంగా ముప్పు కలిగిస్తుంది. ఉప్పుని ఎక్కువ తీసుకోవడం వలన హైపర్ టెన్షన్, కార్డియా వాస్కులర్ సమస్యలు వస్తాయి.
బంగాళదుంప చిప్స్
బంగాళదుంప చిప్స్ వంటి హానికరమైన స్నాక్స్ తీసుకోవడం వలన కొవ్వు పదార్థాలు అధికంగా ఉండడంతో అనేక ఇబ్బందులు కలుగుతాయి.
పామ్ ఆయిల్
పామ్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. హై కొలెస్ట్రాల్ వలన దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. వీటితో పాటుగా పిజ్జా, బర్గర్లకి కూడా దూరంగా ఉండాలి. ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఆరోగ్యం పాడవుతుంది. చీజ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన గుండె సమస్యలు వస్తాయి. ఊబకాయానికి దారితీస్తుంది సో వీటికి దూరంగా ఉండాలి.