Brahma Anandam : ‘బ్రహ్మా ఆనందం’.. గ్లింప్స్‌ రిలీజ్

-

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవితంలో తండ్రీ తనయులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్‌ కలిసి ఈ చిత్రంలో తాత, మనవడుగా సందడి చేయబోతున్నారు. ఆ సినిమాయే ‘బ్రహ్మా ఆనందం’ . ఈ సినిమాని స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మిస్తున్నారు. ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను సోమవారం విడుదల చేశారు. డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

లాస్ట్ ఇయర్ నువ్వు నాకు రాఖీ కట్టి గిఫ్ట్ అడిగితే ఏం ఇచ్చాను అని గౌతమ్ అడిగితే.. ఆయన చెల్లి పాత్ర రాఖీ తిరిగిచ్చేశావ్ అని చెప్పే డైలాగ్తో ఈ గ్లింప్స్ మొదలైంది. ఈ వీడియోలో వెన్నెల కిశోర్ సరదాగా హంగామా చేశారు. ఇక గ్లింప్స్ లాస్టులో గొంతు సవరించుకుంటూ పట్టు పంచెలో బ్రహ్మానందం ఎంట్రీ ఈ గ్లింప్స్ వీడియోకే హైలైట్గా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version