పెళ్ళికి ముందు లివర్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి..? ఇద్దరూ చేయించుకోవాలా..?

-

పెళ్లితో జీవితంలో పెద్ద మార్పు చోటు చేసుకుంటుంది. పెళ్ళికి ముందు, తర్వాత కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే, పెళ్లి చేసుకోవాలని అనుకునే వాళ్ళు ముందు లివర్ టెస్ట్ చేయించుకోవాలట. ఎందుకు పెళ్లి చేసుకోవడానికి ముందు లివర్ టెస్ట్ చేయించుకోలేని.. దాని గురించి ఇప్పుడు చూద్దాం. SGPT టెస్ట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనిని ALT టెస్ట్ అని కూడా అంటారు. అలనైన్ అమైనో ట్రాన్సఫారెస్ ని ఇది కొలుస్తుంది. ప్రధానంగా కాలేయంలో కనపడే ఎంజైమ్ ఇది. ప్రోటీన్లను శక్తిగా మార్చడానికి కీలకపాత్ర పోషిస్తుంది. కాలేయ కణాలు దెబ్బతిన్నప్పుడు లేదా ఎర్రబడినప్పుడు రక్త ప్రవాహంలోకి ఇది లీక్ అవ్వడం జరుగుతుంది.

ఆరోగ్యానికి కీలకమైన మార్కర్ గా ఇది పనిచేస్తుంది. హెపటైటిస్, ఫ్యాటీ లివర్ వ్యాధి వంటి కాలేయ వ్యాధిని నిర్ధారించడానికి పర్యవేక్షించడానికి ఈ టెస్ట్ సహాయపడుతుంది. ఎలివేటెడ్ ALT స్థాయిలు కాలేయం దెబ్బతినడం లేదా పనిచేయకపోవడానికి సూచిస్తాయి కానీ కండరాల గాయం లేదంటే గుండె జబ్బులు వంటి ఇతర పరిస్థితిలో కూడా ముడిపడి ఉండవచ్చు.

అయితే పెళ్లికి ముందు ఎందుకు ఈ టెస్ట్ చేయించాలి అనేది చూస్తే.. కాలేయ ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో ఇది సహాయపడుతుంది. భాగస్వాములు ఇద్దరూ భవిష్యత్తు శ్రేయస్సు పై ప్రభావం చూపే ఏవైనా సంభావ్య కాలేయ సమస్యల గురించి తెలుసుకునేటట్టు చేస్తుంది. కాలేయ వ్యాధులు ప్రారంభ దశలో గుర్తించొచ్చు. పెళ్లికి ముందు ఇద్దరూ కాలేయ టెస్ట్ చేయించుకోవడం వలన కాలేయ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు. సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకోవడం వలన సమస్య ముదిరిపోకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version