స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాన్ని తప్పక తీసుకోవాలి..

-

స్త్రీలు చాలా సున్నితమైన వాళ్ళు..వారి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం..రోజు వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది ఇప్పుడు చుద్దాము..
పోషకాహార లోపం కారణంగా పెరుగుదల సరిగ్గా లేకపోవడం, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే మహిళలు ముందు నుంచే పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ టైమ్‌లో పోషకాహారం తీసుకోవడం వల్ల వారికే కాకుండా పుట్టే పిల్లలకి కూడా మంచిది. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంగా ఉండాలంటే ముందునుంచే పోషకాహారం చాలా ముఖ్యం. తల్లిపాల కారణంగా పిల్లలకి సరైన పోషణ అందుతుంది. ఎదుగుతున్న పిల్లలకి కాల్షియం, ఐరన్, అయోడిన్ వంటివి చాలా అవసరం.

గర్భధారణ సమయం నుంచి వృద్ధాప్యం వరకూ మహిళల్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తాయి. ఇక పోతే మహిళలు వ్యాయామం చేయడం కూడా ముఖ్యం. సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర అనేవి మహిళల ఆరోగ్యం విషయంలో కీ రోల్ పోషిస్తాయి..మహిళలు ఆరోగ్య వంతులుగా ఉండాలని అంటే కొన్నిటికి దూరంగా ఉండాలి..ప్యాకేజ్డ్ ఫుడ్, డ్రింక్స్, జంక్‌ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. దీనిని నుంచి కేలరీలను తగ్గించుకోవచ్చు. కేలరీలు ఎక్కువగా ఉంటే యుక్తవయస్సు నుంచే ఊబకాయం, మొటిమలు, పీసీఓడి, హార్మోన్ల సమస్యలు ఎదురవుతాయి..

ఆకుపచ్చ కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్‌తో పాటు ఇంట్లో వండిన ఆహారమే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. పోషకాహార కొరతను దూరం చేయడం కాస్తా కష్టమే. ఎందుకంటే మీ శరీరానికి తగిన పరిమాణంలో ఆహారం మాత్రమే కాకుండా ఏమేం అవసరమో తెలుసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, నీరు, విటమిన్స్, మినరల్స్ ఇలాంటి పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంత అవసరమో తెలుసుకుని అవే తీసుకోవాలి..వయస్సు ను బట్టి ఆహారం ఎంత తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి… అప్పుడే స్త్రీలు మరింత ఆరోగ్యంగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version