విద్యా రంగంలో వైయస్.జగన్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు కొత్త కానుకల పేరుతో పథకాలను అందిస్తున్నారు..ఈ నేపథ్యంలో వచ్చిన పథకం జగనన్న అమ్మఒడి పథకం..జగనన్న అమ్మఒడి పథకం మూడో విడత కింద జిల్లా వ్యాప్తంగా 2,09,776 మంది రూ.314.66 కోట్ల మేర లబ్ధి పొందనున్నారు. జిల్లాలోని 38 మండలాల పరిధిలో ఉన్న 3,087 పాఠశాలలు, కళాశాలకు చెందిన 3,47,510 మంది విద్యార్థుల వివరాలు ఎన్‌రోల్ చేయగా, అందులో 2.09 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు.
మార్గదర్శకాల ప్రకారం ఒక తల్లికి ఇద్దరు పిల్లలుంటే వారిలో ఒకరికి మాత్రమే పథకం వర్తించనుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళంలో సోమవారం పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో నిధులు జమ కానున్నాయి. పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ఈ ఏడాది రూ.2 వేలు తగ్గించి, మిగతా రూ.13 వేల నగదు జమ చేస్తారు. జిల్లా స్థాయిలో ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు..
కొత్తగా చేరిన లబ్ధి దారుల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. అయితే, ఈ జాబితాలో తమ పేర్లు లేవని చాలా మంది తల్లులు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. అలా ఎవరైనా తాము అర్హులమకాదా అని చెక్ చేసుకోవాలి అంటే.. గ్రామ, వార్డు సచివాలయంకు వెళ్లి తెలుసుకోవచ్చు.. లేదా వాలంటీరును సంప్రదించిన లిస్టులో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు…