ఈరోజు రాశుల వారికి చాలా మంచి రోజు..

-

మన అదృష్టం రోజూ ఒకేలా ఉండదు.. మన తల రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.కొందరికి కొన్ని నమ్మకాలు ఉంటాయి.రాశుల ప్రకారం అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటారు.అలాంటి వారికి మే 8 న ఎలా ఉంటుందో ఇప్పుడు చుద్దాము..

వృషభం: అనుకున్న పనులు జరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది. సమాజంలో పలుకుపడి పెరుగుతుంది. ఇంట్లో వాళ్ళ నుంచి అహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు..

మిథునం: మిత్రులతో కలహాలు కలుగుతాయి. ఋణ ఒత్తిడి తొలగడానికి నూతన ఋణాలు చెయ్యాల్సి వస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి.. ఇంటాబయట అందరితో మాటలు పడవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యొగాల లో మంచి లాభాలు ఉంటాయి.

కర్కాటకం: సమాజంలో పెద్దల ఆదరణ లభిస్తుంది. దూర ప్రయాణములు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు మెరుగవుతుంది. వ్యాపారాలు మెరుగు పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో సకాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు..ఈరోజు మంచి రోజు..

సింహం: ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ వాతావరణం చికాకులను కలిగిస్తుంది. బంధుమిత్రులు కొన్ని వ్యవహారాలలో మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఎర్పడ తాయి..

కన్య: చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు నుండి బయట పడతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారంతో సంతోష పడతారు. వ్యాపారాలలో అనుకోకుండా లాభాలు అందుతాయి..ఈరోజు మీకు ఆశాజనకంగా ఉంటుంది.

తుల: ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాలలో శుభవార్తలు అందుతాయి. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు అంచనాలు అందుకుంటారు..ఈరోజు లాభసాటిగా ఉంది.

వృశ్చికం: కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా ఇబ్బంది కలిగిస్తాయి. దూర ప్రయాణ చేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అంత మంచి రోజు కాదు.. ఆదాయ విషయంలో లోటు పాట్లు ఉంటాయి. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి.

ధనస్సు: అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. మీ మాటల తో కుటుంబ సభ్యులు బాధ పడథారు. నిరుద్యోగులు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

మకరం: చిన్ననాటి మిత్రుల చుసుకుంటారు. . గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుంచి విముక్తి కలుగుతుంది.

కుంభం: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో గొడవలు ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపారమున స్థిరమైన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సంతృప్తికర పరిస్థితులు కలుగుతాయి.

మీనం: చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యాపార వ్యవహారాలలో ఆలస్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు సతమతం చేస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యొగాలలో చికాకులు వస్తాయి..ఈరోజు అంత మంచిగా లేదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version