ఈ రాశి వారికి ఉద్యోగాలలో మంచి పురోగతి..

-

జూన్ 25 శనివారం రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము…

మేషం.. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి ముఖ్య సమాచారం. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి..దైవదర్శనాలు..దూర ప్రయాణాలు..

వృషభం… .సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.ఆస్తి వివాదాలు.. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి..జాగ్రత్తగా ఉండాలి..

మిథునం… దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి..

కర్కాటకం.. ఆత్మీయుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం..ఇష్ట దైవాన్ని దర్శించుకోవాలి.

సింహం… .ఎంత శ్రమపడినా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆరోగ్యసమస్యలు. బంధువర్గంతో తగాదాలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు..లాభాలు ఆశించినంత ఉండవు.. జాగ్రత్తగా ఉండాలి..

కన్య… .ఇంటా, బయట విమర్శలు. పనుల్లో ఆటంకాలు. ఉద్యోగయత్నాలు ఫలించవు. ఆలయాలు సందర్శిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి..కొత్త ఉద్యోగ అవకాశాలు..

తుల... విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి..శుభవార్తలు వింటారు..

వృశ్చికం… కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. యుక్తితో సమస్యలు అధిగమిస్తారు. విద్యార్థులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి..ఈరోజు అంతా మంచి జరుగుతుంది..

ధనుస్సు…పనుల్లో తొందరపాటు. బంధువులతోతగాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.శ్రమ ఎక్కువ, లాభం తక్కువ..

మకరం… వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి..కొత్త పనులు ఫలించవు..

కుంభం…. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. ధనలబ్ధి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మంచి ఫలితాలు..

మీనం…. మిత్రులే శత్రువులుగా మారతారు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు ముందుకు సాగవు. అనారోగ్య సూచనలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు..దైవదర్శనాలు, కొత్త పనులు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version