మీ జీవితం ఎలా ఉండాలనేది మీ చెవుల మీద ఆధారపడి ఉందని మీకు తెలుసా..?

-

పైన టైటిల్ చదివిన తర్వాత చెవుల మీద ఆధారపడటం ఏంటి..? మేబీ చేతులు అయ్యుంటుందని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. యెస్ ఎవ్వరి జీవితమైన వారి చెవుల మీదే ఆధారపడి ఉంటుంది. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.

సావాస దోషం అనే పదం మీకు తెలిసే ఉంటుంది. మీ స్నేహితులు ఎలాంటివారో మీరు అలాంటి వారే అని దానర్థం. అంటే మీరు ఎవరితోనైతే ఎక్కువగా సమయం గడుపుతారో.. మీరు వాళ్ళలానే తయారవుతారు అన్నమాట.

అందుకే చెడు స్నేహాలు మానేయమని చెబుతారు. గంజాయి తోటలో తులసి చెట్టు మొలవడమనేది అసాధ్యమని దాని అర్థం. సేమ్ టూ సేమ్ దానిలాగే.. మీరు ఏదయితే మీ చెవులతో వింటారో అలాగే తయారవుతారు.

దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

ఒకరోజులో పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకూ మీరు ఏది వింటారో అది మీ మెదడులో నిక్షిప్తమైపోతుంది. మీరు చెడు మాటలు, చెడు ఆలోచనలు చేసినట్లయితే మీకు కూడా చెడు చేయాలన్న ఆలోచన కలుగుతుంది.

అదే పాజిటివ్ మాటలు, మంచి స్నేహితులతో మాట్లాడినట్లయితే మంచి ఆలోచనలు కలిగి జీవితాన్ని హాయిగా జీవించగలుగుతారు. అందుకే మీ జీవితం మీ చెవుల మీద ఆధారపడి ఉందని చెప్పేది.

మీరు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే.. దాని గురించే ఎల్లప్పుడూ ఆలోచించండి. దానికి సంబంధించిన విషయాలే వినండి. ఖచ్చింతంగా మీరు విజయం అందుకుంతారు. చెడు వినకూడదని పెద్దలు అందుకే చెప్పారని తెలుసుకోండి.

అందుకే ఉదయం లేవగానే చెవులకు ఆహ్లాదాన్ని కలిగించే సంగీతం వినండి. మనసుకు ప్రశాంతతను చేకూర్చే మాటలను వినండి. మీ జీవితం బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version