వావ్.. దీప్ వీర్ ను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా?

-

వావ్.. దీప్ వీర్.. మీరు సూపర్బ్. ఎవరికి ఏమైనా పర్లేదు.. ఏది ఎక్కడ పోతే మాకేంటి అని అనుకుంటున్న జనరేషన్ లో దీప్ వీర్ జంట అందరికీ ఆదర్శంగా నిలిచారు. నేటి జనరేషన్ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో ప్రధానమైనది ప్లాస్టిక్ భూతం. దీని వల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయో అందరికీ తెలుసు.. కానీ ప్లాస్టిక్ ను ఉపయోగించకుండా మాత్రం ఉండలేరు.

అందుకే.. దీప్ వీర్ తన బెంగళూరు రిసెప్షన్ లో ఏర్పాటు చేసిన విందులో ప్లాస్టిక్ అనేదే లేదట. అంటే.. ప్లేట్లు, టేబుల్స్, గ్లాసులు…. లాంటి వస్తువులన్నీ.. బయోడీగ్రేడబుల్ వస్తువులట. అంటే అన్నీ పర్యావరణహిత వస్తువులే. సూపర్ కదా. పర్యావరణం కోసం ఈ జంట ఈమాత్రమైనా ఆలోచించి.. తమ తోచింది చేశారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత గురించి ప్రపంచానికి చాటారు.

దీప్ వీర్ అభిమానులు కేవలం వాళ్లపై అభిమానం పెంచుకోవడం కాదు.. వాళ్లలా పర్యావరణానికి తోడ్పడి… ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టడం కోసం వాళ్లతో భాగస్వాములు కావాలి. అప్పుడే వాళ్లకు నిజమైన అభిమానులనిపించుకుంటారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version